Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది. కెమెరా ముందు ఉండటం, స్టేజ్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి. అలా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత కెరీర్ ప్రారంభంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. అయితే, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయి ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది నిధి. రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, ప్రభాస్, పవన్ కళ్యాణ్..ఇలా బిగ్ స్టార్..క్రేజ్ ఉన్న దర్శకులతో సినిమాలు చేసింది. కానీ, నిధికి సక్సెస్‌లు వచ్చింది చాలా తక్కువ. అయినా, కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే తమిళంలో, హిందీలో అవకాశాలను అందుకుంటోంది.
నిధి అగర్వాల్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఆమె గ్లామర్. అయితే, ఒక హీరోయిన్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం గ్లామర్ సరిపోదు. మంచి కథలు, గుర్తుండిపోయే పాత్రలు, నటనలో పరిణతి అవసరం.
అందుకే తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిధి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు ఆమెకు దక్కితే, తనపై ఉన్న ఇమేజ్‌ను మరింతగా మార్చుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
తమిళ ఇండస్ట్రీపైనే ఫుల్ ఫోకస్:
నిధి అగర్వాల్ ఇప్పటివరకు తమిళంలో ‘ఈశ్వరన్’, ‘భూమి’, ‘కలగ తలైవన్’ వంటి సినిమాల్లో నటించింది. 2022లో వచ్చిన కలగ తలైవన్ తర్వాత తమిళంలో ఆమె సినిమా రాలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గ్యాప్ గురించి ఆమె స్పందించింది. తమిళంలో మంచి సినిమా చేయాలని ఉంది.. అందుకే, సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను..అంటూ కూడా ఇటీవల చెప్పింది నిధి. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి సరైన వేదిక తమిళ పరిశ్రమ అనే భావనలో ఉంది ఈ సిమార్ట్ బ్యూటీ. అందుకే, కోలీవుడ్ ఇండస్ట్రీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలిపింది.











