తెలంగాణ

రామచంద్రరావు అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అరెస్ట్‌ను, ఇతర బీజేపీ నేతల ముందస్తు హౌజ్ అరెస్టులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి ఆయకట్టు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దారుణమని ధ్వజమెత్తారు.

 జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అరెస్ట్‌ను, ఇతర బీజేపీ నేతల ముందస్తు హౌజ్ అరెస్టులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి ఆయకట్టు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా లేక పోలీసులతో రాజ్యమేలుతున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

 గత బీఆర్ఎస్ పాలనను మించి కాంగ్రెస్ పాలనలో అణచివేతలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న ‘ఇందిరమ్మ రాజ్యం’ అంటే ఇదేనా అని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు తెస్తామనడం వెనుక నాటి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజులను పునరావృతం చేయడమేనా? అని నిలదీశారు. ప్రతిపక్ష నేతలను నిరంతరం గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు.

 తక్షణమే బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుతో పాటు అరెస్టు చేసిన నాయకులందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టు రైతాంగ ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత అని, ఆలస్యం చేయకుండా తక్షణమే జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని సూచించారు.

 రైతుల డిమాండ్లను పట్టించుకోకుండా, నిరసన తెలపడానికి వెళ్తున్న ప్రతిపక్షాలను అరెస్టులు చేస్తూ కాలయాపన చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల ఆగ్రహానికి గురై గతంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు.

 

#BandiSanjay#NRamachandrarao#BJPProtest#JuralaProject#TelanganaPolitics#CongressGovt#FarmersProtest#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి