తెలంగాణ

తెలంగాణలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. ఈసీ నోటీసులపై ఓటర్ల బేఖాతరు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణలో భారత ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల సగ్ర సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. సవరణ నిమిత్తం ఈసీ జారీ చేసిన నోటీసులకు స్పందించడంలో ఓటర్లు బేఖాతరు చేస్తుండటంతో దాదాపు 43.98 లక్షల మంది(53.62%) ఓట్లు రద్దయ్యే ప్రమాదం నెలకొంది.

 తెలంగాణలో భారత ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల సగ్ర సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. సవరణ నిమిత్తం ఈసీ జారీ చేసిన నోటీసులకు స్పందించడంలో ఓటర్లు బేఖాతరు చేస్తుండటంతో దాదాపు 43.98 లక్షల మంది(53.62%) ఓట్లు రద్దయ్యే ప్రమాదం నెలకొంది. మొత్తం 82.02లక్షల మందికి నోటీసులు పంపగా, కేవలం 38 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు విచారణకు హాజరయ్యారు.

 అత్యంత విచిత్రంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న 66,342 మంది ఓటర్లలో ఏకంగా 63,984 మంది (96%) విచారణకు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్,  పరిసర జిల్లాల్లో ఓటర్ల అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3.03లక్షల మందికి నోటీసులు ఇవ్వగా 2.48 లక్షల మంది స్పందించలేదు.

 జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 8,31,316 మంది, రంగారెడ్డిలో 6,03,149 మంది, హైదరాబాద్‌లో 5,13,264 మంది, సంగారెడ్డిలో 2,24,058 మంది, నిజామాబాద్‌లో 1,64,435 మంది ఓటర్లు నోటీసులపై స్పందించలేదు. అలాగే వికారాబాద్ (1,63,603), సూర్యాపేట (1,50,671), నల్గొండ (1,49,754), భద్రాద్రి కొత్తగూడెం (1,41,726), మహబూబ్‌నగర్ (1,31,249), వరంగల్ (1,16,165), నిర్మల్ (1,06,965), కరీంనగర్ (1,01,945) జిల్లాల్లో కూడా లక్షకు పైగా ఓటర్లు గైర్హాజరయ్యారు.

 నోటీసులకు స్పందించి తమ గుర్తింపు కార్డులు చూపించిన 38 లక్షల మందిలో కూడా కేవలం 27.44 లక్షల మంది పత్రాలు మాత్రమే నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. వీరి పేర్లను మాత్రమే తుది ఓటర్ల జాబితాలో పొందుపరచనున్నారు. మిగిలిన వారి పత్రాల్లో తప్పులు ఉండటం, లేదా ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 విచారణకు ఓటర్లు దూరంగా ఉండటానికి పలు సాంకేతిక కారణాలు కనిపిస్తున్నాయి. 2002 నాటి ఓటు ఆధారాలను సమర్పించాలనడం, తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు కోరడం, బూత్ లెవల్ అధికారులు (BLO) పంపిన నోటీసులు సరిగ్గా చేరకపోవడం, ఈసీ జాబితాలో లేని ఇతర గుర్తింపు పత్రాలను అడగడం వంటి నిబంధనలతో సామాన్య ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ విచారణపై అనాసక్తి చూపిస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

#TelanganaSIR2026#VoterRollRevision#ElectionCommissionOfIndia#KodangalVoters#ElectionNotices#RevanthReddy#ElectionNoticeNotice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి