సినిమా

Vaishnavi Chaitanya: వైష్ణవి వయసెంతో తెలుసా..? 32 కాదు..వికీపీడియా తప్పు చెప్తోంది!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vaishnavi Chaitanya: కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కొన్ని షార్ట్ ఫిలింస్ లోనూ బాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా, టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య..అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత బేబి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సరికొత్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ వయసు విషయంలో గుగూల్‌లో తప్పుగా ఉందని చెప్పింది. తన వయసు 32 కాదని, 25 ఏళ్ళేనని రివీల్ చేసింది.

బేబి సినిమాతో వైష్ణవి చైతన్య టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో యూత్ ఆడియన్స్‌ను కుర్రకారు మనసులను దోచుకున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్.. ఇటీవల ఎపిక్ సినిమాతో వచ్చి ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా అటు ఆనంద్ దేవరకొండకి ఇటు వైష్ణవి చైతన్య కి ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లోనే వైష్ణవి వయస్సు గురించి ట్రోలింగ్ జరిగింది. తన వయస్సు 32 అని.. ఆనంద్ దేవరకొండ కన్నా పెద్దది అంటూ రకరకాలుగా పుకార్లు షికారు చేశాయి.

వికీపీడియాలో వైష్ణవి వయసు 32 ఏళ్లుగా చూపిస్తోంది. దీంతో, నెటిజన్లు షాకవుతూ రకరకాల కామెంట్లు చేశారు. అలా, వైష్ణవి ఏజ్ గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై తాజాగా వైష్ణవి స్పందిస్తూ షాకయ్యేలా క్లారిటీ ఇచ్చింది. వికీపీడియాలో తన సమాచారం తప్పుగా ఉందంటూ వస్తున్న వార్తలకి స్వయంగా తానే ఫుల్‌స్టాప్ పెట్టింది.

ఇటీవల ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న వైష్ణవి.. 'వికీపీడియాలో నా వయసు 32 ఏళ్లని చూపిస్తున్నారు, కానీ అందులో ఉన్న సమాచారం అబద్ధం. నాకు ప్రస్తుతం 25 ఏళ్లు మాత్రమేనని వెల్లడించింది. 2001లో పుట్టాను. ఇది నా ఆధార్ కార్డు. కేవలం నా వయసు విషయమే కాదు.. నా పుట్టిన ప్రదేశం విషయంలోనూ వికీపీడియాలో కూడా చాలా తప్పులు ఉన్నాయి' అని స్పష్టం చేసింది వైష్ణవి చైతన్య. మొత్తానికి, 7 ఏళ్ళ వయసు తప్పుగా ఉందని వైష్ణవి చెప్పిన సమాచారంతో అర్థమైంది.

#Vaishnavi Chaitanya#Tollywood Acress#Epic#Baby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి