క్రైమ్

కోట్ల ఆస్తులు.. బినామీల పేర్లు.. 'నిమ్స్' లక్ష్మీభాస్కర్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలు!

రచన: Mamatha puppala6 నిమిషాల పఠనం

రాష్ట్రంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించే నిమ్స్(NIMS) ఆస్పత్రిలో ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నిమ్స్ అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ అక్రమ సంపాదన, బినామీ వ్యవస్థపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విరుచుకుపడింది.

 రాష్ట్రంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించే నిమ్స్(NIMS) ఆస్పత్రిలో ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నిమ్స్ అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ అక్రమ సంపాదన, బినామీ వ్యవస్థపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విరుచుకుపడింది. ఆయన ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో మంగళవారం వేకువజాము నుంచే హైదరాబాద్ నగరం సహా మూడు జిల్లాల్లోని మొత్తం 12కు పైగా కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభమయ్యాయి.

 ఏసీబీ అధికారుల సుదీర్ఘ తనిఖీల్లో వెలుగుచూస్తున్న విస్తుపోయే నిజాలు, అక్రమాస్తుల పత్రాలు వైద్యారోగ్య శాఖతో పాటు సచివాలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజాసేవ చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, వైద్యాధికారి ముసుగులో ఆయనొక ‘భారీ అవినీతి తిమింగలం’గా అవతరించినట్లు ఈ సోదాల్లో ఆధారాలు లభిస్తున్నాయి.

 కళ్లు చెదిరే భవనాలు.. నలుగురు బినామీలు!

ఈ సోదాల సందర్భంగా లక్ష్మీభాస్కర్‌కు చెందిన బినామీ ఆస్తుల నెట్‌వర్క్ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కూకట్‌పల్లిలోని అత్యంత విలాసవంతమైన 'ఆనర్ హోమ్స్'లో దాదాపు రూ.6కోట్ల విలువైన భవనం, ఎర్రమంజిల్‌లో రూ.4కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్‌మెంట్ సహా పలు ఖరీదైన స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ చట్టం కన్నుగప్పేందుకు నలుగురు విభిన్న బినామీల పేర్లపై కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

 కేవలం తన ఇల్లు, నిమ్స్‌లోని కార్యాలయానికే పరిమితం కాకుండా.. తన కుమారుడి ఆఫీసు, అంతేకాకుండా తన వద్ద పనిచేసే డ్రైవర్ల ఇళ్లపైనా ఏసీబీ బృందాలు దాడులు జరిపాయి. డ్రైవర్లను సైతం బినామీలుగా వాడుకుని వారి పేర్ల మీద కోట్లాది రూపాయల ఆస్తులు, డిపాజిట్లు జమ చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వివిధ బ్యాంకులకు చెందిన లాకర్ల వివరాలను, ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

 మంత్రి పీఏతో నెట్‌వర్క్.. బయటపడ్డ సంచలన కోణం!

ఈ తనిఖీల్లో అత్యంత సంచలనాత్మకమైన రాజకీయ అనుబంధం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన పలు అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఫండ్స్ మళ్లింపు వెనుక ఒక మంత్రి పీఎస్‌గా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి హస్తం ఉన్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. లక్ష్మీభాస్కర్, శ్రీకాంత్ రెడ్డి మధ్య కాలక్రమేణా సాగిన పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు వలయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

 గతంలోనూ ఆరోపణలు.. రంగంలోకి ఏసీబీ!

 గతంలోనూ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై విశాఖపట్నంలో భారీ భూ లావాదేవీల అక్రమాలు, నిమ్స్ ఆసుపత్రిలోని మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్టుల్లో కమీషన్లు దండుకోవడం, నిధుల మళ్లింపు వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా ఉంచారు. పక్కా ఆధారాలు లభించడంతోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే మెరుపు దాడులకు శ్రీకారం చుట్టారు. కాగా, ఈ తనిఖీల్లో లభించిన స్థిరాస్తుల పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం మరియు కీలకమైన డిజిటల్ ఆధారాలను పరిశీలించిన అనంతరం, ఏసీబీ అధికారులు జప్తు చేసిన మొత్తం ఆస్తుల లెక్కలతో పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

 

#NIMSAcbRaids#DrLakshmiBhaskar#DisproportionateAssets#TelanganaAcb#NIMSScam#SrikanthReddy#HyderabadCrimeNews#TelanganaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి