క్రైమ్

Madhapur: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హత్య చేశాడా?

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఒక ఓయో(OYO) హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఒక ఓయో(OYO) హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నో(28)గా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న(సోమవారం) మధ్యాహ్నం నగరానికి వచ్చి, సిద్ధిఖీనగర్ రోడ్డునంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' రూమ్ నంబర్ 303లో అద్దెకు దిగారు.

సోమవారం తెల్లవారుజామున సుమారు 1గంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. శ్రీనివాస రవి తేజ, హోటల్ సిబ్బందితో కలిసి తీవ్ర గాయాలతో ఉన్న షారన్ నిఖితను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

 సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిశీలించగా, మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. యువతి మరణించినట్లు వైద్యులు చెప్పగానే ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆస్పత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు వెంటనే ఓయో హోటల్ రూమ్ నంబర్ 303ని తనిఖీ చేయగా, గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై తీవ్రమైన రక్తపు మరకలు కనిపించాయి. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌ను రప్పించి శాస్త్రీయ ఆధారాలను సేకరించారు.

 ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రియుడే దాడి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రవి తేజ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి తీవ్రంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకున్నాక అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

#MadhapurOyoMurder#SharonNikithaTopno#SrinivasaRaviTeja#MadhapurCrimeNews#HyderabadNews#OyoRoomMurder#TelanganaPolice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి