సినిమా

Mokshagna: కన్‌ఫర్మ్ మోక్షజ్ఞ డెబ్యూకి జానర్ ఫిక్స్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mokshagna: గత నాలుగైదేళ్ళ నుంచి నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంటరవబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ మోక్షజ్ఞ ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక, ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం, ఈ సినిమాకి సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం.

మోక్షజ్ఞ సినిమా అంటే ఎలాంటి కథను బాలయ్య ఫైనల్ చేశాడు. ఆ జానర్ ఏంటీ..మాస్ సినిమానా క్లాస్ సినిమా..ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమానా..డివొషనల్ సబ్జెక్టా..సోషియో ఫాంటసీనా..ఇలా జానర్ గురించి ఇండస్ట్రీలో బాగా న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, తాజాగా అందుతున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ డెబ్యూ సినిమా సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందబోతుందని తెలుస్తోంది.

దర్శకుడు వశిష్ఠకి ఈ జానర్ మీద మంచి పట్టుంది. ఆ విషయం బింబిసారా సినిమాతోనే అర్థమైంది. ఈ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ కి సాలీడ్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ, ఈ సినిమా బడ్జెట్ కారణంగా ప్రస్తుతానికి నిలిచినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకే, మోక్షజ్ఞ సినిమాను లైన్‌లో పెట్టాడని వార్తలు వచ్చాయి.

ఏదేమైనా, బాలయ్య వారసుడిని దర్శకుడు మాస్ హీరోగా పరిచయం చేస్తాడని అందరూ అనుకుంటే..అనూహ్యంగా సోషియో ఫాంటసీ జానర్‌తో తెరకెక్కనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, కొడుకుతో బాలయ్య కూడా స్క్రీన్ మీద దాదాపు 40 నిమిషాల పాటు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే, నిజమైతే మొదటి సినిమాతోనే బాలయ్య తన కొడుతో కలిసి నటించడం ఎప్పటికీ ఓ అద్భుతమైన మెమరీగా మిగిలిపోతుంది.

#Mokshagna Nandamuri#Balakrishna Nandamuri#Mallidi Vassishta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి