తెలంగాణ

సచివాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో కీలక భేటీ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ సచివాలయానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఉదయం 11:30గంటలకు ఆయన సెక్రటేరియట్‌కు చేరుకుని, పలు శాఖల అధికారులతో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న పలు డిమాండ్లపై ముఖ్యమంత్రితో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి

 తెలంగాణ సచివాలయానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఉదయం 11:30గంటలకు ఆయన సెక్రటేరియట్‌కు చేరుకుని, పలు శాఖల అధికారులతో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న పలు డిమాండ్లపై ముఖ్యమంత్రితో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీకి ముందే నిన్న(సోమవారం) సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు మొదటి దఫా సంప్రదింపులు జరిపారు.

 ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, ఉద్యోగుల ప్రాధాన్య డిమాండ్లపై నేడు సీఎంతో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాల నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్ జాజులతో మరోసారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధానాంశాలు, సమస్యల పరిష్కార మార్గాలపై వారు ప్రాథమికంగా ఒక స్పష్టతకు రానున్నట్లు తెలుస్తోంది.

 ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వస్తాయని భావిస్తున్న ఉద్యోగులు, ఈ భేటీ ఫలితాలపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. డీఏలు, పీఆర్‌సీ, పెండింగ్ బిల్లుల విడుదల సహా కీలక సమస్యలపై ఈ భేటీ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) వాయిదాల విడుదలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

 దీనితో పాటు నూతన వేతన సవరణ కమిషన్ (PRC) నివేదిక అమలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం (EHS) బలోపేతం, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగుల న్యాయమైన కోరికలను క్రమపద్ధతిలో తీర్చేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు ఈ సమావేశం ద్వారా సానుకూల పరిష్కారం దొరుకుతుందనే ధీమాతో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు.

#RevanthReddy#TelanganaSecretariat#BhattiVikramarka#TelanganaEmployees#EmployeeDemands#SanjayJaju#TelanganaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి