క్రైమ్

నిమ్స్‌లో తొలిసారి ఏసీబీ ఆకస్మిక సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఇంట్లో తనిఖీలు!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు తొలిసారి సోదాలు చేపట్టారు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు తొలిసారి సోదాలు చేపట్టారు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టాయి.

 నిమ్స్ ఆసుపత్రి చరిత్రలోనే ఓ ఉన్నతాధికారిపై ఈ స్థాయిలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటిసారి కావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ సోదాలు ఏకకాలంలో మూడు జిల్లాల పరిధిలోని 12విభిన్న ప్రాంతాల్లో కొనసాగాయి. డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసం, నిమ్స్‌లోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, డిపాజిట్లు, బ్యాంక్ వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.

 ప్రాథమిక తనిఖీల్లో భాగంగా అధికారులు ఇప్పటికే కొన్ని అక్రమాస్తులకు సంబంధించిన కీలక ఆధారాలు, లెక్కల్లో లేని భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సదరు అధికారిపై పలు భూ లావాదేవీల వివాదాలు, నిధుల దుర్వినియోగం, మోసాలకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఏసీబీ సుదీర్ఘకాలం పాటు ఆయన కదలికలపై నిఘా ఉంచి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండగా, వివిధ బ్యాంక్ లాకర్లు, స్థిరాస్తుల పత్రాలు, బాండ్లు, డిపాజిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎంత మొత్తం అక్రమాస్తులు లభ్యమయ్యాయో ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

 

#NIMSHospital#ACBRaids#DrLakshmiBhaskar#TelanganaACB#DisproportionateAssets#HyderabadNews#TelanganaCorruptionCases#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి