సినిమా

Mahaveer Karna: ‘మహావీర్ కర్ణ’గా రాఘవ లారెన్స్..ఈసారి సరికొత్త అవతారంలో!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Mahaveer Karna: సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన ‘మహావీర్ కర్ణ’గా కనిపించనున్నాడు. దీంతో, ఈ సారి లారెన్స్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు.

Mahaveer Karna: సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన ‘మహావీర్ కర్ణ’గా కనిపించనున్నాడు. దీంతో, ఈ సారి లారెన్స్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు.

మహాభారతంలో అత్యంత క్లిష్టమైన, శక్తివంతమైన పాత్రల్లో కర్ణుడు ఒకరు. వీరత్వం, దానగుణం, ఆత్మగౌరవం, స్నేహానికి కట్టుబాటు, విషాదం వంటి అనేక భావోద్వేగాల కలయికగా కర్ణుడి పాత్ర ఉంటుంది. అలాంటి పాత్రను తెరపై చూపించడం ఏ నటుడికైనా పెద్ద సవాలే. ఇక రాఘవ లారెన్స్ లాంటీ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఈ పాత్రలో నటిస్తే.. ఆయనను ఇప్పటివరకు చూసిన ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన కోణంలో ప్రేక్షకులు చూడొచ్చు. ముఖ్యంగా కర్ణుడి యుద్ధవీరత్వంతో పాటు అతడి అంతర్మథనాన్ని లారెన్స్ ఎలా చూపిస్తారనేది కీలకమైన అంశం.

కర్ణుడి కథలో అసలు ప్రయాణం:

మహాభారతంలో కర్ణుడి జీవితం మొదటి నుంచి చివరి వరకు విషాదంతో కూడుకున్న వీరగాథ. జన్మ రహస్యం, సామాజిక అవమానాలు, దుర్యోధనుడితో స్నేహం, దానగుణం, పరశురాముడి శాపం, కవచకుండలాల దానం, కురుక్షేత్ర యుద్ధం.. ఇలా కర్ణుడి జీవితంలో ప్రతి దశలోనూ సినిమాకు కావాల్సిన డ్రామా ఉంది. అందుకే ‘మహావీర్ కర్ణ’ కథను కేవలం యుద్ధ చిత్రంగా కాకుండా కర్ణుడి భావోద్వేగ ప్రయాణంగా తెరకెక్కిస్తే ప్రేక్షకులకు మరింత బలమైన అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది. మరి, దర్శకుడు రమేష్ వర్మ ఈ కథను తెరపై ఏ విషంగా తీసుకురాబోతున్నాడో చూడాలి.

అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు:

పౌరాణిక కథలను భారీ స్థాయిలో తెరకెక్కించే ట్రెండ్ భారతీయ సినిమాలో పెరుగుతున్న సమయంలో ‘మహావీర్ కర్ణ’ ప్రాజెక్ట్‌పై ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. రాఘవ లారెన్స్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు కర్ణుడి పాత్రలో కనిపించనున్నారంటేనే ఆ హైప్, క్రేజ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. పాన్ ఇండియా చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. ప్రస్తుత, రామాయణ..జై హనుమా లాంటి విజువల్ వండర్స్ రూపొందుతున్న సమయంలో రాఘవ నుంచి ఈ సినిమా రాబోతుండటం మరో విశేషం. కాగా, ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 2027లో రిలీజ్ చేయబోతున్న విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు.

#Raghava Lawrence#Mahaveer Karna#Ramesh Varma#Tollywood#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి