Anil Ravipudi: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 9 బ్లాక్ బస్టార్స్ అందుకున్న ఆయన ఇప్పుడు 10వ సినిమాను రెడీ చేస్తున్నాడు. అయితే, మరోసారి వార్తల్లో నిలిచారు అనిల్ రావిపూడి. తాజాగా అభిమానులతో జరిగిన ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అభిమానుల తీరుపై అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. దయచేసి కాళ్ళు మొక్కొద్దు..నమస్కారం చేయండి చాలూ అంటూ కాస్త అభిమానిపై సీరియస్ అయ్యాడు.
అనిల్ రావిపూడి సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పటాస్ నుంచి మొదలుకొని సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌గారు వరకు ఆయన ప్రయాణం విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా 'జనవరి 12న విడుదల' అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవబోతోంది.
ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి, వెంకటేష్ కి జంటగా కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని సమాచారం. అయితే, ఇలా వరుసగా స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే స్మాల్ స్క్రీన్ మీద కూడా గ్యాప్ ఇవ్వకుండా సందడి చేస్తూ అలరిస్తున్నారు అనిల్ రావిపూడి. డ్రామా జూనియర్స్, సరిగమప..ప్రోగ్రాంస్ కి అనిల్ రావిపూడి జడ్జె్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కారు దిగగానే ఒక అభిమాని కాళ్లపై పడబోయాడు. దీనికి, కాస్త కోపగించుకుంటూ..కాళ్ళపై పడొద్దూ..నమస్కారం చేయండి చాలు అంటూ వెళ్లిపోయారు.
దీనికి, సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ, సరదాగా నవ్వుతూ..నవ్విస్తూ కనిపించే అనిల్ రావిపూడి..అభిమానులు ప్రవర్తనపై కోపగించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. కానీ, దీన్ని బట్టి చూస్తే ఆయనకి ఎవరూ కాళ్ళు మొక్కడం ఇషటముండదని..అభిమానానికి హద్దులుండాలని కోరినట్టు స్పష్టంగా తెలుస్తోంది.










