సినిమా

Varun Tej: మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాతో సాలీడ్ హిట్ దక్కించుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్‌కి దక్కిన విజయమిది. దీని, తర్వాత కూడా మూడు సినిమాలను లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వరున్ తేజ్ చెలెల్లు..మెగా డాటర్ నిహారిక నిర్మాతగా 'బరి' అనే సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాతో సాలీడ్ హిట్ దక్కించుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్‌కి దక్కిన విజయమిది. దీని, తర్వాత కూడా మూడు సినిమాలను లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వరున్ తేజ్ చెలెల్లు..మెగా డాటర్ నిహారిక నిర్మాతగా 'బరి' అనే సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

సుకుమార్ తో వరుణ్ తేజ్:

పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన సుకుమార్ నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అయితే, దర్శకుడిగానే కాకుండా సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌లో ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఇదే బ్యానర్‌లో వరుణ్ తేజ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన యువ దర్శకుడిని ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం చేయనున్నట్టు సమాచారం.

అలాగే, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా వరుణ్ తేజ్‌తో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే కంప్లీట్ యాక్షన్ అండ్ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుంది. వరుణ్ కోసం అలాంటి ఓ పవర్ ఫుల్ కథనే సిద్ధం చేసినట్టుగా సమాచారం. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో గ్యాంగ్ స్టర్ పాత్రను హై ఓల్టేజ్ లో వరుణ్ కోసం డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి వరుణ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

సెట్స్‌పైనున్న "బరి":

ప్రస్తుతం, వరుణ్ తేజ్ 'బరి' అనే సినిమాను చేస్తున్నాడు. నిహారిక నిర్మాణంలో ఇంతకముందు కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసిన యువ దర్శకుడు యదు వంశీ 'బరి' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, తండ్రి నాగబాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'బరి' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

#Varun Tej#Sukumar#Bari#Karthik Subbaraj#Niharika Konidela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి