Tollywood: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తాజా సమాచారం. టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి–బుచ్చిబాబు సానా–మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియాలో ఈ ముగ్గురి కలయికలో సినిమా రాబోతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మెగాస్టార్ అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది.
అయితే, ఈ వార్తకు సంబంధించి ప్రస్తుతం అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి కమిట్ అయినప్పటికీ, హీరో ఎవరనే విషయం ఇంకా ఖరారు కాలేదని సమాచారం. మెగాస్టార్‌తో సినిమా అనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత, రామ్ చరణ్‌తో ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇక, బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ కూడా మైత్రీతోనే ఉంటుందని సమాచారం. అయితే ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ పేరు తెరపైకి వచ్చింది.
చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోకు బుచ్చిబాబు లాంటి యువ దర్శకుడు కథ చెప్పబోతున్నాడనే వార్త సహజంగానే భారీ అంచనాలను పెంచుతుంది. బుచ్చిబాబు సినిమాల్లో ఎమోషన్, బలమైన పాత్రలు, కమర్షియల్ అంశాలను కలిపే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ రకంగా, చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేస్తే.. అది భారీ స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మారుతుందనడంలో సందేహమే లేదు. కాబట్టే, ఈ కాంబినేషన్ మీద అటు మెగా అభిమనౌల్లో ఇటు సినీ వర్గాలలో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. మరి, ఇది నిజంగా మెటీరియలైజ్ అవుతుందా లేదా చూడాలి. కాగా, చిరు ప్రస్తుతం కాకా సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రాబోతుంది.











