సినిమా

Aadarsha Kutumbam: అనుకున్నదే జరిగింది మళ్ళీ వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం’

రచన: Anshu5 నిమిషాల పఠనం

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం–హౌస్ నంబర్ 47 (AK47)’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో మాత్రం వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం–హౌస్ నంబర్ 47 (AK47)’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో మాత్రం వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ముందుగా అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల విడుదల తేదీ మారే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల వాయిదా విషయాన్ని తెలిపుతూ అలాగే, కొత్త తేదీని ప్రకటిస్తూ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.

దసరా సీజన్‌-అందుకే వాయిదా: అక్టోబర్ 2వ తేదీ కంటే కూడా అక్టోబర్ 9న విడుదల చేయడం వల్ల దసరా సెలవుల సీజన్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా వాయిదా వేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు పండుగ సెలవులు కలిసొచ్చే అవకాశం ఉండటంతో రిలీజ్ తేదీపై ఆసక్తి పెరిగింది.

అయితే, ఈ సినిమా విడుదల తేదీపై గతంలోనే పలు రకాల వార్తలు వచ్చాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 లేదా దసరా సమయంలో మరో తేదీకి మారే అవకాశం ఉందంటూ సెప్టెంబర్ మొదటి వారంలోనే కథనాలు వెలువడ్డాయి. ఆ రకంగానే తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడిన విషయాన్ని ప్రకటించారు. కాగా, ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో ఉన్న స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేశారు. భానూ మాస్టర్ ఈ సాంగ్‌కి డాన్స్ కొరియోగ్రఫీని అందించాడు. డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ ఈ డాన్స్ నంబర్‌లో వెంకీ-శ్రీనిధి లతో కలిసి స్టెప్పులేశారు.

ఇక, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. వెంకటేష్‌ను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ.. కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలను కూడా టీజర్‌లో పరిచయం చేశారు. మొత్తానికి, అనుకున్నదే జరిగింది. దసరా బరిలో దింపాలనే మేకర్స్ మరోసారి ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వేశారు.

#Aadarsha Kutumbam#Venkatesh#Srinidhi Setty#Trivikram Srinivas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి