సినిమా

Tollywood: విషాదం..క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతూ "సై "విలన్ ప్రదీప్ రావత్ మృతి!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నితిన్, జెనీలియా జంటగా నటించిన సై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయమైన నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. తెలుగుతో పాటు పలు హిందీ సినిమాలలోనూ మంచి పాత్రల్లో నటించి మెప్పించాడు ప్రదీప్ రావత్.

కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో నటించినప్పటికీ, ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్మ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజా సినిమాలో కాస్త కామెడీ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ప్రదీప్ రావత్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన అసలు పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావ‌త్‌.

గత కొంతకాలంగా ప్రదీప్ రావత్ క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్నాడు. వైద్యం జరుగుతున్నప్పటికీ, ప‌రిస్థితి విష‌మించి మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచాడు. ఇక, ఈ విష‌యాన్ని ఆయ‌న సన్నిహితుడు, న‌టుడు య‌శ్‌పాల్ శ‌ర్మ త‌న ఇన్ స్టా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ప్రదీప్ రావత్ 1985లో రాజ్ బ‌బ్బ‌ర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐత్‌బార్' తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత, బీఆర్‌ చోప్రా నిర్మించిన 'మ‌హా భార‌త్' సీరియ‌ల్‌లో అశ్వ‌ద్ధామ‌ పాత్రలో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక, 2000లో ఆమిర్ ఖాన్ నటించిన 'ల‌గాన్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

సై తర్వాత, గ‌జిని సినిమాతో స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్నాడు. మిగతా భాషల కంటే తెలుగులో 100కు పైగా సినిమాల్లో న‌టించిన ప్రదీప్ రావ‌త్‌ గ‌త నెల‌లో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా నటించిన 'గాయప‌డ్డ సింహం' సినిమాలో క‌నిపించాడు. ఇదే ప్ర‌దీప్ రావ‌త్ చివరి తెలుగు సినిమా. ఇక ఆయన మ‌ర‌ణించిన‌ విష‌యం తెలుసుకున్న అభిమానులు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా రావత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

#pradeepravath#actorpradeepraavath#pradeepravathdeath#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి