Sukumar: రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, సుకుమార్‌లది ప్రత్యేకమైన బంధం. దీని, గురించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. సుకుమార్ సినిమా మ్యూజికల్‌గా హిట్ అయింది అంటే అది డీఎస్పీ వల్లే అని క్షణం ఆలోచించకుండా చెప్పాల్సిందే. సుకుమార్ సక్సెస్ క్రెడిట్ లో ఖచ్చితంగా మన దేవిశ్రీ క్రెడిట్ చాలా ఉంది. వీరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్‌గా ట్రెండ్ సెట్ చేసింది.
సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కలిసి చేసిన చివరి సినిమా పుష్ప సిరీస్. అయితే, ఇప్పుడు..మైత్రీ మూవీ మేకర్స్‌తో సుకుమార్ ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇందులో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడు. అయితే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి ఉంటాడా లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనికి, కారణం గత కొంత కాలంగా మైత్రీ వారికి, దేవికి చిన్న మనస్పర్థలు రావడమే.
లేదంటే, ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ బర్త్ డేకి ఎల్లమ్మ, సినిమా నుంచి లుక్ రిలీజ్ చేశారు. అలాగే, కింగ్ 100వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ అని అధికారికంగా ప్రకటించారు. మరో తమిళ సినిమా నుంచి కూడా అప్‌డేట్ ఇచ్చారు. ఇలా, దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి ఆయనకి విషెస్ చెప్పారు. కానీ, మైత్రీ నుంచి మాత్రం అది కరువైంది.
దీంతో, సుకుమార్-చరణ్ కాంబోలో మొదలయ్యే ఆర్సీ 17 కి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి కాకుండా ‘ధురంధర్’ మూవీ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్ దేవ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే అనిరుధ్ రవిచందర్ గానీ, థమన్ గానీ ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే సుకుమార్ చాలా ఎమోషనల్‌గా తీసుకుంటాడు. అలాగే, దేవి కూడా. చూడాలి, మరి మనస్పర్థలను పక్కన పెట్టి మైత్రీ వారు సుకుమార్ సినిమాకి డీఎస్పీని తీసుకుంటారా లేదా.












