Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి..ఈ హాట్ భామ ఏ సినిమా చేసినా..సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంటోంది. అయితే, ఈ సారి మాత్రం కాస్త నెగిటివ్‌గా కామెంట్స్ వస్తున్నాయి. దీనికి, కారణం ఎవరూ ఊహించని వయసు మళ్ళిన హీరోతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇంతకీ, ఆ ముసలి హీరో ఎవరూ..ఏ భాషలో మీనాక్షి ఇలాంటి సాహసం చేయడానికి ఒప్పుకుంది..పూర్తి కథనంలో చూద్దాం.
మీనాక్షి చౌదరి అనగానే చాలా హిట్ సినిమాలే గుర్తొస్తాయి. ముఖ్యంగా, గోట్..లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం..అనగనగా ఒక రాజు లాంటి హిట్ సినిమాలు అలా కళ్ళముందు మెదులుతాయి. మీనాక్షి చౌదరి 2021లో, ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత హిట్ 2లో నటించింది. తెలుగు తెరకి పరిచయమైన అతికొద్ది కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ప్రస్తుతం మీనాక్షి, తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. అయితే, ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. హిందీలో సీనియర్ హీరో అక్షయ్ కుమార్ కి జంటగా నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఈ అప్‌డేట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మన మీనూను తెగ ట్రోల్ చేస్తున్నారు.
దీనికి కారణం అక్షయ్ వయస్సు 58 సంవత్సరాలైతే, మీనాక్షి వయస్సు 29 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది తెలుసుకొని నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అయితే, ఇవన్నీ మీను కాదు, ఏ హీరోయిన్ కూడా లెక్క చేయదు. అవకాశం రావడమే గొప్ప విషయం అయినప్పుడు, ఇలాంటి జూజూబీ కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటారు.












