సినిమా

Ravi Teja-IrumuDi: "విక్రమార్కుడు" సెంటిమెంట్ రిపీటవుతుందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ravi Teja-IrumuDi: రవితేజ కెరీర్‌లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో చేసిన విక్రమార్కుడు ఓ ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. చిల్లర దొంగగా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.

Ravi Teja-IrumuDi: రవితేజ కెరీర్‌లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో చేసిన విక్రమార్కుడు ఓ ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. చిల్లర దొంగగా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.

తండ్రీకూతుళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అన్నీ విక్రమార్కుడు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. మళ్ళీ, ఆ తరహా కథలో ఇప్పటి వరకూ నటించలేదు. ధమాకా తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రవితేజకి దక్కలేదు. అయినా, బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ కి ఏ ఢోకా లేదు. రవితేజ సక్సెస్‌లలో లేని దర్శకులకి, హీరోయిన్స్‌కి అవకాశం ఇస్తాడు. అలాంటి, సినిమాలు చాలా వరకూ హిట్ సాధించాయి.

అలాగని, స్టార్ డైరెక్టర్స్ ని పక్కన పెడతాడా అంటే అలా కాదు, వారికి గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాడు. అయితే, ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో, ఈసారి తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ ఉన్న కథను ఎంచుకున్నాడు. తమిళ కథానాయిక ప్రియ భవానీ శంకర్ రవితేజకి జంటగా నటించింది. ఈ సినిమా అయ్యప్ప దీక్ష, సున్నితమైన భావోగ్వేదాల మిళితమైన కథతో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి, విక్రమార్కుడు సెంటిమెంట్ వర్కౌట్ అయి హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

ఇక, ఇప్పటికే..ఇరుముడి సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలనే పెంచాయి. ముఖ్యంగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. రెండు పాటలు రిలీజవగా..అవి మంచి పిక్చరైజేషన్‌తో ఆకట్టుకున్నాయి. ఇక, రవితెజ-ప్రియ భవానీ శంకర్‌ల పేయిర్ కూడా చాలా బావుంది. ఇవే, సినిమా సక్సెస్ కి కారణం అవుతాయని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

#irumudi#raviteja#shiva nirvana#priyabhavanishankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి