Sujeeth: సుజీత్...అతి కొద్ది కాలంలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు..సినిమా మేకింగ్‌లోనూ హాలీవుడ్ స్టైల్ కనిపించింది. మొదటి సినిమా 'రన్ రాజా రన్'. శర్వానంద్ కి డీసెంట్ హిట్ పడిన సినిమా ఇది. ఇదే, సమయంలో 'సాహో' కథ చెప్పి, ప్రభాస్ ని మెప్పించి సినిమా తీశాడు. ఫలితం ఎలా ఉన్నా, సుజీత్ కి మాత్రం మంచి పేరొచ్చింది.
ఆ తర్వాత, మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అందరూ అనుకున్నారు..ఇక సుజీత్ ఇండస్ట్రీలో కనిపించడని. కట్ చేస్తే 'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ని ఇచ్చాడు. అంతేకాదు, ఈ సినిమాతో మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని చూపించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఒక్కసారి సినిమా మేకింగ్ స్టైల్ నచ్చితే.. పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుంటాడు.
సుజీత్ విషయంలో అదే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వీరి కాంబోలో 'ఓజీ 2' స్క్రిప్ట్ ఫైనల్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇలాంటి, దూకుడులో సుజీత్ నెక్స్ట్ సినిమాను కూడా పవన్ కళ్యాణ్‌తోనే చేయబోతున్నాడని అందరూ ఫిక్సైయ్యారు. ముఖ్యంగా, మెగా అభిమానులైతే ఇంకా 'ఓజీ' హ్యాంగోవర్ లోనే ఉన్నారు. కానీ, ఇక్కడే బిగ్ ట్విస్ట్ పడింది.
ఇంతకముందే, సుజీత్-నాని కాంబినేషన్‌లో 'బ్లడీ రోమియో' సినిమాను ప్రకటించి గ్లింప్ కూడా వదిలారు. వాస్తవానికి 'ఓజీ' తర్వాత సెట్స్‌పైకి రావాల్సిన సినిమా ఇదే. కానీ, 'ప్యారడైజ్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నాని. దాంతో, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'ఓజీ 2'ని సెట్స్‌పైకి తేవాలనుకున్నాడు. ఇప్పుడు, ఈ లైనప్‌లో మార్పు కనిపిస్తోంది. సెప్టెంబర్ వరకూ నాని 'ప్యారడైజ్' సినిమా నుంచి ఫ్రీ అవుతాడట.
దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్టోబర్ నుంచే 'బ్లడీ రోమియో'ను సెట్స్‌పైకి తేనున్నాడట సుజీత్. వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఈ సినిమాను రిలీజ్ చేసి, వెంటనే పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ 2'ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. మొత్తానికి, సుజీత్ ప్లానింగ్ లో చిన్న కన్‌ఫ్యూజన్ ఉన్నా, లైనప్ మాత్రం అదిరిపోయింది.












