సినిమా

Tollywood: బిగ్ ట్విస్ట్‌.. NTR ప్రెస్‌నోట్‌లో ఆ ఒక్క‌టి ఎక్క‌డ‌..?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ వర్గాల్లో ‘రా ఎన్టీఆర్’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళ హీరో విజయ్ తరహాలోనే ‘ఊరు వాడ’ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం పెద్ద సంచలనంగా మారింది. అయితే, ఈ హడావుడి వెనుక తారక్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ఊహాగానాలు జోరందుకోవడంతో.. ఎన్టీఆర్ అధికారిక బృందం రంగంలోకి దిగింది. ఆ సేవా సంస్థతో కానీ, వారి కార్యక్రమాలతో కానీ హీరో ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Tollywood: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ వర్గాల్లో ‘రా ఎన్టీఆర్’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళ హీరో విజయ్ తరహాలోనే ‘ఊరు వాడ’ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం పెద్ద సంచలనంగా మారింది. అయితే, ఈ హడావుడి వెనుక తారక్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ఊహాగానాలు జోరందుకోవడంతో.. ఎన్టీఆర్ అధికారిక బృందం రంగంలోకి దిగింది. ఆ సేవా సంస్థతో కానీ, వారి కార్యక్రమాలతో కానీ హీరో ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో వివాదం ముగిసిందని అంతా భావించినా.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది.

ఎన్టీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను సదరు అభిమాన సంఘం నిర్వాహకులు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికగా స్పందించిన సదరు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రెస్ నోట్ అసలు ఎన్టీఆర్ పంపించిందేనా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. “ఆ నోట్‌పై ఎన్టీఆర్ సంతకం ఎక్కడ ఉంది? సంతకం లేని ఇలాంటి లెటర్లు కావాలంటే నేనూ వంద సృష్టిస్తా” అంటూ సదరు అభిమాని ఏకంగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

గత ఆరేళ్లుగా 40 వేల మంది వాలంటీర్లతో సమాజ సేవ చేస్తుంటే.. మాకు దక్కిన రిటర్న్ గిఫ్ట్ ఇదా? నేరుగా తారక్ ఫోన్ చేసి ఆపేయమంటే ఈ క్షణమే అంతా పక్కన పెడతాం. కానీ, ఎవరో రాసిన ప్రెస్ నోట్లను చూసి మేం వెనక్కి తగ్గేది లేదు. రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రతినిధి తేల్చి చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తాము ప్రాణమిచ్చే హీరో కోసం నిస్వార్థంగా పనిచేస్తుంటే, తమపై కొందరు కుట్రలు చేస్తున్నారని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతికి చెందిన ఒక కీలక వ్యక్తి తమ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేయిస్తూ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హీరో పేరు చెప్పి తామెక్కడా తప్పు చేయలేదని, కేవలం సేవ మాత్రమే చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

సంతకం లేని ప్రెస్ నోట్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ సెన్సేషన్‌గా మారింది. మరి ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా స్పందించి తన అభిమానుల సందేహాలకు క్లారిటీ ఇస్తారా? లేక ఈ రచ్చ ఇలాగే సాగుతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

#ntr#tarak#ntrpressnote#ntrpoliticalentry
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి