వ్యాపారం

Gold : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

రచన: Kumar3 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి .

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి . హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతున్న పసిడి ధరలు ఈ రోజు కొద్దిపాటి లాభాలను నమోదు చేశాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,43,570కు చేరగా.. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,31,600లకు చేరుకుంది. బంగారంతో పోలిస్తే పారిశ్రామిక డిమాండ్ నెమ్మదించడంతో వెండి ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,35,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ఆర్థికంగా విపత్కర పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డాలర్‌తో రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు ఆధారంగానే ఈ ధరల పెరుగుదల నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల సమాచారం ప్రకారం.. ధరలు సరికొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతుండటంతో వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఆషాఢమాసంలో కాస్త కొనుగోళ్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే నెల నుంచి మళ్లీ శుభకార్యాలు, మంచి ముహూర్తాలు ఉండటమే కారణం.

#Gold rates#hike#national#hyderabad#bullion market#business
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి