రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు గాను బీఆర్ఎస్ తరఫున పెద్దఎత్తున నిరననలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా బాల్కొండ నియోజకవర్గంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుధవారం ఉదయం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీంతో మాజీ మంత్రి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.
https://x.com/TeluguScribe/status/2077254539850457541?s=20
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు.ఈ క్రమంలోనే దీక్ష స్థలికి వెళ్లకుండా పోలీసులు ఆయన్ను ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు.దీంతో ఆయన పోలీసులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.












