తెలంగాణ

WaterLifting : రైతులకు శుభవార్త.. మోటార్లు ఆన్ చేసిన కాంగ్రెస్ సర్కార్

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. పంటలు వేయడానికి కూడా వెనుకాముందు ఆలోచిస్తున్నారు. ఓవైపు వర్షాలు లేక మరోవైపు బావులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. పంటలు వేయడానికి కూడా వెనుకాముందు ఆలోచిస్తున్నారు. ఓవైపు వర్షాలు లేక మరోవైపు బావులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలని ఆవేదన చెందుతున్నారు. సాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం అలా చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయని చెబుతోంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మోటార్లు ఆన్ చేయబోమని తేల్చిచెప్పింది. విశ్రాంత ఇంజినీర్లు సైతం మోటార్లు ఆన్ చేయాలని ఏం కాదని చెబుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కన్నెపల్లి వద్ద నీరు వృథాగా పోవడం వలన తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే మార్కెట్లో ధాన్యం ధరలు ఎగబాకాయి.ఇదే విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. రైతుల ఆదాయం పడిపోతుందని, బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2077025829759152396?s=20

అటు ప్రతిపక్షాలు, ఇటు రైతుల నుంచి వస్తున్న డిమాండ్లకు మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ తలొగ్గినట్టు కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన 34 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేసింది.కా ళేశ్వరంలోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో దేవాదుల, నార్లాపూర్ రిజర్వాయర్ల మోటార్లు ఆన్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ వద్ద ఒక మోటర్ ద్వారా నీటి లిఫ్టింగ్‌ను అధికారులు ప్రారంభించారు. దీంతో అన్నదాతల కష్టాలు తీరనున్నాయి.కాగా, 2023 ఎన్నికలకు 3 నెలల ముందు మాజీ సీఎం కేసీఆర్ వెట్ రన్ చేసి ఈ మోటార్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.

#motors on#palamuru rangareddy lifiting#telangana#no rains#brs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి