క్రైమ్

TG : గురుకుల విద్యార్థిని ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామంలోని కేజీబీవీలో భవనం రెండవ అంతస్తు నుండి దూకి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామంలోని కేజీబీవీలో భవనం రెండవ అంతస్తు నుండి దూకి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో బాలికను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో పలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

బాలిక ఆత్మహత్యయత్నం వెనుక ప్రేమవ్యవహారమే కారణమని తెలిసింది. తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఓ కేజీబీవీలో ఉట్కూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.

https://x.com/TeluguScribe/status/2077262526497059143?s=20

అయితే, బాలిక సమీప బంధువైన యువకుడు ఆమెను కలిసేందుకు కేజీబీవీ వద్దకు రాగా, బయట నుండి మాట్లాడేందుకు సిబ్బంది అనుమతించారు. ఆ తర్వాత అనుమానం వచ్చి యువకుడి గురించి తెలుసుకునేందుకు క్లాస్ టీచర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.మరుసటి రోజు పాఠశాలకు వచ్చి ఆ యువకుడి గురించి ఆరా తీసేందుకు తల్లిదండ్రులు తమ కూతురిని పిలిపించారు.

అయితే, తమ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందని భయంతో పాఠశాల భవనం రెండో అంతస్తు నుండి దూకి బాలిక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. తీవ్ర గాయాలపాలైన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది.

#gurukula student#suicide attempt#love matter#narayanapet district#kgbv
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి