సినిమా

Tollywood: ‘లెనిన్’ హిట్.. అఖిల్‌కు కొత్త టెన్షన్!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: అక్కినేని అభిమానులు కొన్నేళ్లుగా ఏ క్షణం కోసమైతే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారో, ఆ క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. సరైన బ్రేక్ లేక, బాక్సాఫీస్ వద్ద పదేళ్లకు పైగా నిరీక్షించిన అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ చిత్రం ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్‌ను అందించింది. కింగ్ నాగార్జున స్వయంగా దగ్గరుండి, ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

Tollywood: అక్కినేని అభిమానులు కొన్నేళ్లుగా ఏ క్షణం కోసమైతే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారో, ఆ క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. సరైన బ్రేక్ లేక, బాక్సాఫీస్ వద్ద పదేళ్లకు పైగా నిరీక్షించిన అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ చిత్రం ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్‌ను అందించింది. కింగ్ నాగార్జున స్వయంగా దగ్గరుండి, ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. లాంగ్ వీకెండ్ వసూళ్లతో అల్లాడించిన ఈ చిత్రం.. వర్కింగ్ డేస్‌లోనూ స్థిరమైన కలెక్షన్లతో దూసుకుపోతూ అఖిల్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ విజయంతో అటు అక్కినేని క్యాంప్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంది.

అయితే, ఈ గ్రాండ్ సక్సెస్ తెచ్చిన ఆనందం ఒకవైపైతే.. అఖిల్ ముందు ఇప్పుడు ఒక కొత్త సవాల్, అంతకంటే పెద్ద టెన్షన్ వచ్చి పడ్డాయి. ‘లెనిన్’ సినిమాలో అఖిల్ ఒక కథా పాత్రగా ఒదిగిపోయాడు తప్ప, అందులో అనవసరమైన మాస్ ఎలివేషన్లు గానీ, ఇమేజ్ బిల్డప్‌లు గానీ లేవు. దర్శకుడు కథను నమ్మి సినిమా తీశాడు, అఖిల్ దానికి న్యాయం చేశాడు. కానీ ఇప్పుడు హిట్ పడటంతో అభిమానుల అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. తదుపరి చిత్రంలో అఖిల్‌ను ఒక కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా, భారీ ఎలివేషన్లతో చూడాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అఖిల్ అసలు టెన్షన్ మొదలైంది.

గతంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఒక మోస్తరు సక్సెస్ రాగానే, అఖిల్ ఒక్కసారిగా తన రేంజ్‌ను పెంచేసుకోవాలనే తొందరలో ‘ఏజెంట్’ లాంటి భారీ యాక్షన్ సినిమాను ఎంచుకున్నాడు. ఆ అతి ఉత్సాహం ఎంతటి డిజాస్టర్‌కు దారితీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తప్పు రిపీట్ కాకూడదనే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ కోరుకుంటున్నారని చెప్పి ఒకేసారి ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయే మాస్ కమర్షియల్ సబ్జెక్ట్‌లను ఓకే చేస్తే, అది మళ్లీ మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉంది.

ప్రస్తుతానికైతే అఖిల్ భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ డైరెక్టర్ల వెంట పడటం కంటే.. వైవిధ్యమైన కథలు రాసుకునే అప్ కమింగ్ దర్శకులతో జతకట్టడమే సేఫ్ రూట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ, ‘లెనిన్’ కంటే కాస్త ఎక్కువ మాస్ టచ్ ఇస్తూ ఒక్కో మెట్టు ఎక్కడం అఖిల్ కెరీర్‌కు ఎంతో అవసరం. మరి ఫ్యాన్స్ ఇమేజ్ ప్రెజర్‌ను పక్కన పెట్టి, అఖిల్ తన తదుపరి అడుగులను ఎంత జాగ్రత్తగా వేస్తాడో చూడాలి.

#Lenin#Akhil#BhagyasriBorse#MuraliKishorAbburu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి