Film Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఒక పెద్ద పండగ. ప్రతి ఏటా ఆయన బర్త్‌డేకి ఏదో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది ఆగస్టు 9న రాబోతున్న బ్లాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసిన మహేష్ కెరీర్ బెస్ట్ మూవీ ‘పోకిరి’ మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి రాక సాధారణంగా ఉండబోవడం లేదు.. అంతకు మించి ఉండబోతోంది!
సాధారణంగా టాలీవుడ్‌లో క్రేజీ రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ.. అవన్నీ ఉదయం లేదా సాయంత్రం షోలకే పరిమితమయ్యాయి. కానీ, ‘పోకిరి’ రీ-రిలీజ్ కోసం మేకర్స్ టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక మైండ్ బ్లాయింగ్ ప్లాన్ చేశారు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాకు ఏకంగా స్పెషల్ మిడ్‌నైట్ షోలను ప్లాన్ చేస్తున్నారు. రీ-రిలీజ్ అవుతున్న ఒక పాత సినిమాకు ఇలా అర్ధరాత్రి షోలు వేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి.
ఒక స్టార్ హీరో నటించిన సరికొత్త పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంటే ఎలాంటి హంగామా, అర్ధరాత్రి పూనకాలు ఉంటాయో.. ఇప్పుడు ‘పోకిరి’ రీ-రిలీజ్ కోసం థియేటర్ల దగ్గర అలాంటి వాతావరణమే కనిపించబోతోంది. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు, మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్, ఇలియానా జీరో సైజ్ అందాలు, మణిశర్మ బీజీఎంలను థియేటర్లలో అర్ధరాత్రి పూట ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.












