Ram Charan: బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన ప్రతి సినిమా డిజిటల్ స్క్రీన్‌పై కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని చెప్పలేం. థియేటర్ల వెళ్లే ప్రేక్షకుల అభిరుచికి, ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమాలు చూసే వారి టేస్ట్‌కు చాలా తేడా ఉంటుంది. థియేటర్లలో మాస్ ఎలిమెంట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఓటీటీ షాకే తగిలింది. జూలై 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఊహించని విధంగా అత్యంత పేలవమైన వ్యూస్‌తో తీవ్ర నిరాశపరిచింది.
నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసిన గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ టాప్-10 చార్ట్స్ ప్రకారం.. మొదటి నాలుగు రోజుల్లో 'పెద్ది' కేవలం 19 లక్షల వ్యూస్ మాత్రమే సాధించగలిగింది. థియేటర్లలో సునామీ సృష్టించిన రామ్ చరణ్ సినిమాకు, ఓటీటీలో కనీసం 2 మిలియన్ల వ్యూస్ కూడా రాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ దారుణమైన రెస్పాన్స్‌తో గ్లోబల్ లిస్ట్‌లో ఈ చిత్రం ఐదో స్థానానికి పరిమితమైంది. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై బోర్లా పడటానికి మేకర్స్ చేసిన ఒకే ఒక్క వ్యూహాత్మక తప్పిదమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే.. హిందీ వెర్షన్‌ను అందుబాటులోకి తేకపోవడం. భారతదేశంలో ఓటీటీ మార్కెట్‌ను శాసించేది హిందీ ప్రేక్షకులు. 'పెద్ది' చిత్రాన్ని కేవలం సౌత్ భాషల్లోనే స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చి, హిందీ వెర్షన్‌ను హోల్డ్‌లో పెట్టడం ఈ సినిమా వ్యూస్‌ను దారుణంగా దెబ్బతీసింది. థియేటర్లలో హిందీ బెల్ట్‌పై ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినప్పటికీ, ఓటీటీలో మాత్రం నార్త్ ఆడియన్స్‌కు డబ్బింగ్ సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ భారీ మార్కెట్‌ను విస్మరించడం వల్లే 'పెద్ది' ఓటీటీలో అట్టర్‌ఫ్లాప్ షో చూపించాల్సి వచ్చింది.
ఈ పరిణామాలు చూస్తుంటే స్టార్ పవర్, వందల కోట్ల బడ్జెట్ ఉన్నంత మాత్రాన ఓటీటీలో సక్సెస్ గ్యారెంటీ కాదని స్పష్టమవుతోంది. సరైన రిలీజ్ ప్లానింగ్, డిజిటల్ స్ట్రాటజీ లేకపోతే ఎంతటి బ్లాక్‌బస్టర్ సినిమా అయినా డిజిటల్ స్క్రీన్‌పై బోల్తా కొట్టక తప్పదు. మరి రాబోయే రోజుల్లో 'పెద్ది' హిందీ వెర్షన్ విడుదలయ్యాక అయినా తన పూర్వ వైభవాన్ని అందుకుని వ్యూస్ రేస్‌లో పుంజుకుంటుందో లేదో చూడాలి.












