తెలంగాణ

తెలంగాణలో SIR ప్రక్రియ గడువు పొడిగింపూ.. ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం..

రచన: Venu3 నిమిషాల పఠనం

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియకు ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది.

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియకు ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది. మొదట జూన్ 25 నుంచి జులై 24 వరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల నమోదు, సవరణల కోసం ఫారాల పంపిణీ, సేకరణ చేపడతామని ప్రకటించిన ఈసీ, ప్రభుత్వం నుంచి వచ్చిన వినతులను పరిశీలించి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన మేరకు, నిర్దేశిత ఫారాన్ని నింపి సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిబంధనలను ప్రతి ఓటరు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు గణన ఫారంలో పలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జనన సంవత్సరం ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండటంతో పాటు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌‌‌‌, నియోజకవర్గం, భాగం సంఖ్య, ఓటరు క్రమ సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంది.

అదేవిధంగా, వివాహానికి ముందు మరియు తర్వాత రెండు ప్రాంతాల్లో ఓటు నమోదై ఉంటే, ఒక ఓటును రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసేలోపు అవసరమైన వివరాలను సరిచూసుకుని, ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని, కేవలం 21 శాతమే పూర్తయిందని ఆ మెమొరాండంలో పేర్కొన్నారు. ఇంకో పది రోజుల గడువే ఉన్నదని, దాదాపు 80% ప్రక్రియ కంప్లీట్ కావాలంటే ఈ టైమ్ సరిపోదనిప్రతినిధి బృందం సీఈఓకు వివరించారు.

#telangana#political#ec#sir#elections#election commission
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి