KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయంగా బండి సంజయ్ తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక, బండి సంజయ్ రాజీనామా చేసి ఉంటే బాగుండేదని, రాజకీయంగా భవిష్యత్తు ఉండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తెలంగాణ బీజేపీలో నాయకులు ఎవరున్నారు అన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదని కేటీఆర్ అన్నారు. ఇక, వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ యేనని, మళ్లీ సీఎం కేసీఆర్ యేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. 2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. రావాలని అనుకున్నప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి కచ్చితంగా వస్తారని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. కేంద్ర మంత్రి కుమార స్వామిని కలిశారు.












