తెలంగాణ

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో రేపు నా పరిస్థితి కూడా అంతే..!

రచన: Venu4 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుంగతుర్తి వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను ఈ నెల 20వ తేదీలోపు పార్టీ అధిష్ఠానానికి అందజేస్తానని, పార్టీ నిబంధనల ప్రకారమే అన్ని అంశాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గం వివాదంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలపై చర్చ జరిగినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

తుంగతుర్తి అంశంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... "ఈ విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాను" అని స్పష్టం చేసినట్లు తెలిపిన జగ్గారెడ్డి.. ఈ నియోజకవర్గంలోని మూడు నుంచి నాలుగు మండలాల్లో ఏఐసీసీ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు జరగలేదనే అంశం పై కూడా సమావేశంలో ప్రస్తావన వచ్చినట్టు పేర్కొన్నారు.

తుంగతుర్తి వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను ఈ నెల 20వ తేదీలోపు పార్టీ అధిష్ఠానానికి అందజేస్తానని, పార్టీ నిబంధనల ప్రకారమే అన్ని అంశాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.

అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ పరిస్థితులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతల ప్రస్తావన సైతం సమావేశంలో వచ్చినట్లు తెలిపారు.. జిల్లాలో తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డితో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించినట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

గతంలో బీఆర్ఎస్‌తో కోమటిరెడ్డి చేసిన రాజకీయ పోరాటం గురించీ సమావేశంలో చర్చ జరిగినట్లు.. జిల్లా రాజకీయాల భవిష్యత్తు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు వివరించారు.

అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే ఎవరినైనా పక్కన పెడతారని జగ్గారెడ్డి అన్నారు. "రేపు నా పరిస్థితి అయినా అంతే" అంటూ పార్టీ క్రమశిక్షణ, పనితీరుకే ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తుంగతుర్తి వ్యవహారంపై 20వ తేదీన ఇవ్వనున్న నివేదికలో ఏముంటుంది? పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్న అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి