సినిమా

Tollywood: పాన్-ఇండియా ట్యాగ్‌పై నాని కామెంట్స్...నిజమే కదా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా అంటూ ఆయా రీజనల్ భాషను గుర్తిస్తూ చెప్పుకునే వారు. కానీ, గత కొన్నేళ్ళుగా ఈ పద్ధతి మారి సౌత్‌లో ఏ సినిమా పలు భాషల్లో రిలీజైతే అది పాన్-ఇండియా అంటూ పిలుస్తున్నారు. అసలు, పాన్ ఇండియా సినిమా అంటే ఏంటీ..? అని చాలామంది ప్రశ్నించారు కూడా. నానీ కూడా ఇప్పుడు ఈ ట్యాగ్ అంటే నచ్చదని తేల్చిపారేశాడు.

ఒక భాషలో హిట్ అయిన కథను ఇతర భాషలలోనూ మళ్ళీ తీసిన సినిమాలున్నాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇక, ఇలా ఒక భాషలో హిట్ అయిన కథలో నటించిన హీరోలూ ఉన్నారు. తమిళంలో హిట్ కథ అటు బాలీవుడ్ కి వెళ్ళింది ఇటు టాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషలైన కన్నడ, మలయాళ భాషలలోనూ తీసి సక్సెస్ సాధించారు.

అప్పుడు లేదు ఇలా పాన్ ఇండియా ట్యాగ్ అనేది. మన టాలీవుడ్‌లో పోకిరి లాంటి సినిమాలు ఇతర భాషల్లో కూడా హిట్ సాధించాయి. తమిళంలో విజయ్..హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి వారు నటించారు. ఆ కథ అన్ని భాషలలో హిట్ అయింది. కానీ, ఆ సినిమాలను పాన్ ఇండియా సినిమా అని చెప్పలేదు.

అంతేకాదు, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు సౌత్‌లో తెలుగు-తమిళ భాషలలోనూ మంచి ఆదరణను దక్కించుకున్నాయి. మరి, ఆ సినిమాలను పాన్ ఇండియా అని ట్యాగ్ తగిలించలేదు. హిందీ సినిమాలే అని చెప్పుకున్నారు..అంటూ కౌంటర్ ఇచ్చాడు నాని. అందుకే, తన ప్యారడైజ్ సినిమాను కూడా ఇండియన్ సినిమాగానే చూడాలని చెప్పాడు నాని. ఇప్పుడు నాని చేసిన ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, ది ప్యారడైజ్ సినిమాను సెప్టెంబర్ 24న 7 భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

#nani#the paradise#kayadu lohar#srikanth odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి