తెలంగాణ

Telangana: ఆర్టీసీ కార్మికుల నిరీక్షణకు తెర.. రాష్ట్ర యూనియన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

తెలంగాణ RTC కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యూనియన్ ఎన్నికల విషయంలో శుభవార్త అందింది. తాజాగా TGRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణ RTC కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యూనియన్ ఎన్నికల విషయంలో శుభవార్త అందింది. తాజాగా TGRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధిక మెజారిటీ సాధించిన యూనియన్‌ను సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నుకునేందుకు గాను హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ ఎన్నికల పూర్తి షెడ్యూల్ పరిశీలిస్తే... సెప్టెంబర్ 21న పోటీకి ఆసక్తి ఉన్న యూనియన్లు సమ్మతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 22న డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లాల డీసీఎల్‌లకు అందజేస్తారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 25న అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి జాబితాకు తుది రూపం ఇవ్వనున్నారు.

సెప్టెంబర్ 26న పోటీలో ఉండే యూనియన్లకు గుర్తుల కేటాయింపుతో పాటు, ప్రధాన రిటర్నింగ్ అధికారికి తుది ఓటర్ల జాబితాను సమర్పిస్తారు. అనంతరం సెప్టెంబర్ 29న యూనియన్లు నమూనా బ్యాలెట్ పత్రాలను సేకరించవచ్చు. మరోవైపు పోలింగ్ అక్టోబర్ 9వ తేదీన ఉదయం 5:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు జరుగుతుంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించి, అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇక ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న TGRTC స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక సంఘ్, తెలంగాణ జాతీయ మజ్జూర్ యూనియన్ సహా ప్రధాన కార్మిక సంఘాలకు అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ లేబర్ కమిషనర్ తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైంది..

#Telangana#Hyderabad#TGSRTC#Union Elections#Notification#Schedule
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి