తెలంగాణ

షాద్‌నగర్‌లో విషాదం.. స్కూల్ మెట్ల పైనుంచి పడి విద్యార్థిని మృతి

రచన: NK4 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మెట్లు దిగుతూ కిందపడి విద్యార్థిని మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక స్కూల్ మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడింది. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్కూల్ యాజమాన్యం వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించింది. పర్ణిక మెట్లు దిగుతూ జారిపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Student Dies: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మెట్లు దిగుతూ కిందపడి విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన బాలిక పేరు వర్ణిక. వయసు 9ఏళ్లు. నాలుగో తరగతి చదువుతోంది. వర్ణిక స్కూల్ మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడింది. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్కూల్ యాజమాన్యం వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించింది. వర్ణిక మెట్లు దిగుతూ జారిపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వర్ణిక మృతితో ఇంట్లో, స్కూల్ లో పెను విషాదం అలుముకుంది. పాప తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. వర్ణిక సహచర విద్యార్థులు, స్కూల్ సిబ్బంది షాక్ లో ఉన్నారు. కాగా, ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యం తీరుపై బాలిక తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం తమకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదని, కాలయాపన చేశారని వారు ఆరోపించారు.

మెట్లు దిగుతూ కిందపడ్డాక.. వర్ణికకు బయటకు ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం పాపను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. ఇంతలోనే పాప ఆరోగ్య పరిస్థితి పూర్తి విషమంగా మారింది. కాసేపటికే చనిపోయింది. ఘటన జరిగిన వెంటనే కాకుండా పరిస్థితి విషమించిన తర్వాతే స్కూల్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని పాప తల్లిదండ్రులు వాపోయారు.

తమకు ముందుగానే చెప్పి ఉంటే మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన ట్రీట్ మెంట్ ఇప్పించే వాళ్లమన్నారు. స్కూల్ యాజమాన్యం తీరుపై వారు ఆగ్రహంగా ఉన్నారు. కాగా.. వర్ణిక ఘటన స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. తమ పిల్లల భద్రత గురించి వారు కొంత ఆందోళనకు గురయ్యారు.

#Student Dies#Shadnagar#Ranga Reddy#Stairs#Varnika#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి