Jailer-2: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి జైలర్ 2. బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ అనే విషయం అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా మరియు రిత్విక్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇక, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, అన్నా రాజన్.. ఇప్పుడు రెండవ భాగంలో జాయిన్ అయ్యారు. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్న జైలర్ సీక్వెల్ మూవీకి ఇంకా బిజినెస్ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. జైలర్ సాధించిన కమర్షియల్ సక్సెస్ కారణంగా సీక్వెల్ మూవీపై కూడా కోలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గానూ మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, రిలీజ్ వాయిదా పడుతూ వస్తోన్న జైలర్ 2 ఫైనల్‌గా అక్టోబర్ 15న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. కానీ, ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదట. అందుకే, వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
జైలర్ 2 వర్సెస్ రణబాలి!
సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తమిళనాడు మొత్తం ఎలాంటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే, తెలుగుతో పాటు ఇతర దేశాలలోనూ రజినీ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. చెన్నైలో అయితే, రజినీ సినిమా రిలీజ్ రోజున ఏకంగా స్కూల్స్, కాలేజీస్, కంపెనీస్ కి హాలిడే ప్రకటిస్తారు కూడా. అంతగా, ఆయన సినిమాకి క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ సూపర్ స్టార్‌తో మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పోటీ పడుతున్నాడు.
అక్టోబర్ 15న రజినీకాంత్ జైలర్ 2 రిలీజ్ అవబోతుండగా, 16న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల రణబాలి సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్కడ సన్ పిక్చర్స్, ఇక్కడ మైత్రీ..రెండు భారీ నిర్మాణ సంస్థలు. ఇద్దరు స్టార్స్ మధ్య వార్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి, ఫైనల్‌గా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునేదెవరో చూడాలి.








