Zombie Reddy-2: టాలీవుడ్ లో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో జాంబీ రెడ్డి 2 ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న ఈ సీక్వెల్ సినిమాను భారూ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ చిత్రాన్ని సుపర్ణ ఎస్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాను హను మాన్ కంటే ముందు చేసిన జాంబీరెడ్డి సినిమాకి సీక్వెల్ ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే. ఈ పాన్ ఇండియా సినిమా అంతకంతకు భారీగా మారుతూ వస్తోంది. ఇక, తాజాగా మేకర్స్ కన్నడ సీనియర్ స్టార్ ఉపేంద్ర జాంబీ రెడ్డి 2లో నటిస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమాలో ఉపేంద్ర కి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో ఆయన ఒక చెట్టుకు తలకిందులుగా వేళాడుతూ..చేతిలో ఆయుధంతో ఉన్నాడు.
మిగతా నటులు చేస్తున్నటువంటి రొటీన్ పాత్రలను చేయడానికి ఉపేంద్ర ఎంతమాత్రం ఒప్పుకోడు. ఆయన పాత్రలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. ఆ రకంగా ఉపేంద్రకి తగ్గట్టుగా దర్శకుడు సుపర్ణ ఎస్ వర్మ జాంబీ రెడ్డి 2లో డిజైన్ చేసిన సరికొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో జాంబీ రెడ్డి 2 పై కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

కాగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండగా, ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలి, జపనీస్ భాషల్లోనూ జాంబీ రెడ్డి 2ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేసేలా సన్నహాలు జరుగుతున్నాయి. గ్రాండ్ విజువల్ వండర్‌గా ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ జాంబీ రెడ్డి సీక్వెల్‌ను తీసుకురాబోతున్నారు.










