సినిమా

Pa.Ranjith: 'వెట్టువం' వీడియో గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Pa.Ranjith: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పా. రంజిత్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన కబాలి..ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రంజిత్ అంటేనే కొత్త తరహా కథలు, బలమైన పాత్రలు, కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నాలు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పా.రంజిత్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన మద్రాస్‌, కబాలి, సార్పట్ట పరంపర, తంగలాన్ కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

ఈ క్రమంలోనే రంజిత్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. "వెట్టువం" పేరుతో మరో అద్భుతమైన ప్రపంచాన్ని మనకి చూపించబోతున్నాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ఆర్య, అట్టకత్తి దినేష్, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి "వరల్డ్ ఆఫ్ వెట్టువం" పేరుతో రిలీజైన ఇంట్రడక్షన్ వీడియో ఈ మూవీపై విపరీతమైన ఆసక్తితో పాటు అంచనాలను పెంచేసింది.

ఇంతకముందు సినిమాల మాదిరిగా కాకుండా..ఈ సారి దర్శకుడు పా. రంజిత్ 'వెట్టువం' కథను ఒకే కాలంలో చెప్పకుండా.. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఇలా మూడు టైమ్ లైన్స్ మధ్య చూపించనున్నాడు. అప్పటి కాలంలో ప్రజల జీవన విధానం, వారి ఆచారాలు, కల్చర్ ఎలా ఉండేవో ఓ యాంగిల్ లో చూపించనున్నారు. ఆ కాలం ప్రభావం ప్రస్తుత సమాజంపై ఎలా ఉందనేది ప్రెజెంట్ లో చూపించనున్నారు. ఇక, ప్రకృతి విపత్తుల తర్వాత భవిష్యత్తులో ప్రపంచమంతా ఎలా మారుతుందనేది మరో ముఖ్యమైన భాగంగా ఉండబోతోంది.

దీన్ని బట్టి చూస్తే, ఒక కాలానికి సంబంధించిన కథను మాత్రమే చెప్పకుండా, మూడు కాలాలను కలిపి ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్ఠించి ప్రేక్షకులను మెప్పించేందుకు రంజిత్ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచంలో అధికారం కోసం జరిగే పోరాటం ప్రధానాంశంగా అనిపిస్తోంది. డామినేషన్ కోసం వేర్వేరు తెగలు, వర్గాల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ 'వెట్టువం' కథ నడుస్తుందని అర్థమవుతోంది.

ఇంద్ర విళా వేడుకలో ప్రజల నాయకుడిని ఎన్నుకునే పోటీ కూడా కథలో ప్రధానంగా ఉండబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో చూపించారు. మొత్తానికి, పా.రంజిత్ మాత్రం పాన్ ఇండియా స్కేల్‌లో ప్రాజెక్ట్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నాడు. మరి, ఈ ప్రయత్నం ఏమేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

#Pa.Ranjith#Vettutavm#Aarya#Attakathi Dinesh#Sobhita Dhulipala
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి