ఏపీ

సీమ ఆత్మగౌరవమే అజెండా.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీలో త్వరలో కొత్త రాజకీయ పార్టీతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టడానికి ముందే ఆయన తమ అజెండా, పార్టీపై తన నిర్ణయాలను ప్రకటిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో శుక్రవారం(నేడు) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 ఏపీలో త్వరలో కొత్త రాజకీయ పార్టీతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టడానికి ముందే ఆయన తమ అజెండా, పార్టీపై తన నిర్ణయాలను ప్రకటిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో శుక్రవారం(నేడు) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని, రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి వేదికగా రాజకీయ పార్టీని ఆవిర్భవిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

 తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ సీమ సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలైన రాయలసీమ పౌరుషాన్ని, ప్రాంతీయ హక్కులను కాపాడే పూర్తి బాధ్యతను తమ నూతన పార్టీ తీసుకుంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా రెడ్డి కార్పొరేషన్‌ను ఎందుకు పునరుద్ధరించలేదని ఆయన నిలదీశారు.

 రాష్ట్ర విభజన తర్వాత సీమ ప్రాంతానికే చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే సీమను వాడుకున్నాయని, అక్కడ ఉపాధి లేక ప్రజలు, యువత ఇతర ప్రాంతాలకు వలసలు పోవడానికి వారి వైఫల్యాలే కారణమని విమర్శించారు.

 తమ నూతన పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తూ, వారి భాగస్వామ్యంతో రాయలసీమను తిరిగి పూర్వవైభవంతో 'రతనాల సీమ'గా మారుస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ అన్ని కులాలు, మతాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగి, రాయలసీమ పౌరుషం ఏంటో నిరూపిస్తామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపినట్లయింది.

#VijayasaiReddy#RayalaseemaPolitics#NewPoliticalParty#AndhraPradeshNews#RayalaseemaDevelopment#KootamiGovt#YSRCP#swechanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి