తెలంగాణ

ట్రాఫిక్ చలానాలు వసూళ్ల దందా కాదు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!

రచన: Mamatha puppala7 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో వాహనం బయటకు తీయాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో రోడ్లపై వాహనదారులను నిలిపివేసి, వేలకు వేలు జరిమానాలు వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. చలానాలు చెల్లించలేదనే సాకుతో జప్తు చేయడం, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

  • అస్పష్టమైన చలానాలు.. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు

  • చట్టప్రకారమే నోటీసులు ఇవ్వాలని తేల్చిచెప్పిన ధర్మాసనం

  • గత ఆదేశాల ధిక్కరణపై తీవ్ర అసంతృప్తి

  • పోలీసుల వైఖరిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు

  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

హైదరాబాద్ మహానగరంలో వాహనం బయటకు తీయాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో రోడ్లపై వాహనదారులను నిలిపివేసి, వేలకు వేలు జరిమానాలు వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. చలానాలు చెల్లించలేదనే సాకుతో జప్తు చేయడం, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

 ఈ వేధింపుల పర్వంపై దాఖలైన పిటిషన్లను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. చలానాల సేకరణను ఒక వ్యాపార మార్గంగా లేదా 'ఆదాయ వనరు'గా (రెవెన్యూ డ్రైవ్) మార్చుకోవడం అత్యంత శోచనీయమని స్పష్టం చేసింది. వాహనదారులపై బలవంతపు చర్యలు ప్రయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని, మోటారు వాహనాల చట్ట ప్రకారం నిర్దేశించిన ప్రక్రియను మాత్రమే అనుసరించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఇంకా పత్రాలను స్వాధీనం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

 వాహనదారులను వేధిస్తున్న ప్రధాన అంశాల్లో అస్పష్టమైన చలానాలు, అనుమతి లేని పరికరాల వినియోగం కూడా ఒకటి. ట్రిపుల్ రైడింగ్ లేదా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశారనే నెపంతో రూ.1,200 వరకు భారీ చలానాలు విధిస్తున్నారని, అందులో సరైన చట్టపరమైన విభాగాలు (సెక్షన్లు) పేర్కొనడం లేదని బాధితులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, రోడ్లపైనే మొబైల్‌తో ద్వారా అనుమతులు లేకుండా జరిమానాలు విధించడం, అక్కడికక్కడే కాంపౌండింగ్ ఫీజులు వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదించారు.

 చట్టప్రకారం జరిమానాల నిర్ణయం న్యాయస్థానాల పరిధిలోని అంశమని, పోలీసులు సొంతంగా శిక్షకులుగా మారడం సరికాదని స్పష్టం చేశారు. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో వివరించడానికి ఒక బాధితుడు సమర్పించిన వీడియో ఆధారాలు పోలీసుల అకృత్యాలకు అద్దం పడుతున్నాయి. ఫోన్ మాట్లాడారనే చిన్న కారణంతో ఒక వ్యక్తి వాహనాన్ని రోడ్డుపైనే దాదాపు ఆరు గంటల పాటు అడ్డుకుని, ఆయన వద్ద ఉన్న ఒరిజినల్ ఆర్సీని నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు. వాహనం వదిలినప్పటికీ, ఆర్సీని తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

 ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసి, మరోవైపు ఇలాంటి బలవంతపు జప్తుల ద్వారా సామాన్యులను మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నారని న్యాయవాదులు కోర్టు ఎదుట విన్నవించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం, నిబంధనలు దాటి ప్రవర్తించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే చట్టబద్ధంగా వాహనదారుడికి నోటీసులు జారీ చేయాలని, నిర్ణీత గడువులోగా చలానా చెల్లించని పక్షంలో వారిని సంబంధిత అధికారిక కోర్టు ముందే హాజరుపరచాలని సూచించింది.

అంతేకానీ, రహదారులపై వాహనాలను ఆపి పత్రాలు లాక్కోవడం, గంటల తరబడి నిలిపివేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. చట్టం అనేది ప్రజల రక్షణ కోసం తయారుచేసిందే తప్ప వారిని వేధించడానికి కాదని న్యాయస్థానం గుర్తుచేసింది. పోలీసుల వైఖరిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ, కేసు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

సిగ్నళ్ల వద్ద పసిపిల్లలతో భిక్షాటన దందా

నగరంలోని ప్రధాన సిగ్నళ్లు, రోడ్డు కూడళ్ల వద్ద పసిపిల్లలతో భిక్షాటన చేయిస్తున్న గ్యాంగ్‌ల దందాను కూడా పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. రద్దీ ప్రాంతాల్లో చిన్న పిల్లలతో అపాయకర పరిస్థితుల్లో అపరాధ రుసుములు వసూలు చేసేలా భిక్షాటన చేయిస్తున్న ఫొటోలను న్యాయస్థానానికి అందించారు. ఈ అంశం మూల పిటిషన్‌కు నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ, దీని ప్రాధాన్యత దృష్ట్యా సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

#TelanganaHighCourt#TrafficChallans#HyderabadTrafficPolice#HighCourtWarning#TrafficRules#LegalNewsTelugu#HyderabadNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి