Mahesh-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న వారణాసి (గ్లోబ్ ట్రాటర్) ఆగమనానికి ఇంకా 200 రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో వదిలింది. యావత్ ప్రపంచ దేశాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పాడ్ కాస్ట్ ద్వారా ఈ పాన్ వరల్డ్ అడ్వంచర్‌పై రాజమౌళి అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో 200 రోజుల వారణాసి కౌంట్ డౌన్ మొదలు..అని పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి వస్తోన్న ఈ ఫాలోయింగ్ ఇప్పుడు మహేష్ జనరేషన్ వచ్చేసరికి రెండింతలైంది. ఎక్స్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రత్యేకంగా హ్యాష్‌ట్యాగ్స్ క్రియేట్ చేసి మహేష్ సినిమాలను అభిమానులే ముందు ప్రమోట్ చేస్తున్నారు.
ఇక, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న మహేష్-వారణాసి ఆగమనానికి ఎక్కువ సమయం లేదని మేకర్స్ వెల్లడించారు. మరో, 200 రోజుల్లోనే వారణాసి రాక అని తెలిపారు. మహేష్ బాబు కెరీర్‌లో ఎప్పుడూ ఇంత భారీ స్కేల్ సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. దీనికి, కారణం ప్రభాస్ లాంటి స్టార్స్ ఎప్పుడో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. కానీ, మహేష్ కి ఆ ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది.
మంచి కథ..అందులో నటించి మెప్పిస్తే చాలు..సినిమా హిట్ అవ్వాలి..నిర్మాతకి లాభాలు రావాలి..ఇక్కడి వరకే బాబు ఇప్పటి వరకూ ఆలోచించిన విధానం. కానీ, ఆయన మార్కెట్ స్థాయిని మించి ఇప్పుడు ఆలోచిస్తునాడు. పలు బ్రాండ్స్‌తో మహేష్ కి ఇతర దేశాలలోనూ మంచి క్రేజ్ ఉంది. దీంతో, వారణాసి సినిమాపై బజ్ రావడానికి రాజమౌళి ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు. దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న వారణాసి ఎన్ని వేల కోట్ల లాభాలను రాబడుతుందో చూడాలి. కాగా, ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.











