తెలంగాణ

అర్ధరాత్రి హైడ్రామా.. కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ విడుదల..!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ ముదిరాజ్‌ను బొల్లారం పోలీసులు శుక్రవారం ఉదయం 4గంటల సమయంలో విడుదల చేశారు. బీఎన్ఎస్/సీఆర్‌పీసీ 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీ చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను వదిలిపెట్టారు. అంతకుముందు గురువారం రాత్రి ఆయనను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు రహస్యంగా తరలించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ ముదిరాజ్‌ను బొల్లారం పోలీసులు శుక్రవారం ఉదయం 4గంటల సమయంలో విడుదల చేశారు. బీఎన్ఎస్/సీఆర్‌పీసీ 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీ చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను వదిలిపెట్టారు. అంతకుముందు గురువారం రాత్రి ఆయనను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు రహస్యంగా తరలించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

 రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తమ పార్టీ నేతలు, సిబ్బందిపై జరుగుతున్న వరుస అరెస్టులు, పోలీసుల తీరుపై ఆయన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే అవకాశముంది. మీడియా సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ (Formula E) రేసింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన కోర్టు ముందు విచారణకు హాజరుకానుండటంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 ఒకవైపు పీఆర్వో విడుదల, మరోవైపు కేటీఆర్ మీడియా సమావేశం, ఫార్ములా-ఈ కేసు విచారణతో హైదరాబాద్ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతను పటిష్టం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 ప్రతిపక్ష నేతలను, వారి సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయడమే ధ్యేయంగా పాలన సాగుతోందని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పీఆర్వోను రహస్యంగా స్టేషన్లు మారుస్తూ విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని మండిపడుతున్నారు. మరోవైపు ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణను కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నామని, న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఈ వరుస పరిణామాలతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో మాత్రమే కాకుండా నగరవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

#KTR#ManikyaMahesh#BollsramPS#FormulaECase#NampallyCourt#BRSParty#TelanganaPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి