సినిమా

Allu Arjun: 'రాకా' నుంచి అప్‌డేట్స్ మొదలు..ఇక ఏదైనా ఖండాంతరాలు దాటే..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అత్యంత భారీ పాన్ వరల్డ్ సినిమా రాకా. తాజాగా, ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ మొదలయ్యాయి. 37 అనే నంబర్ ని వదిలి అందరిలో ఓ క్యూరియాసిటీని పెంచారు. అయితే, దీనికర్థం అల్లు అర్జున్ రాకా మూవీలో తోడేలుగా కనిపిస్తాడని..ఆ నంబర్ కి అర్థం కూడా అదేనంటూ వార్తలు వస్తున్నాయి. ఇక, తాజాగా సోషల్ మీడియాలో మరో అప్‌డేట్ ని పంచుకున్నారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రాబోతోంది.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న సినిమా రాకా. రెండు భాగాలుగా ఇది తెరకెక్కుతోన్నట్టుగా తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2027లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీపిక పడుకొణ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో దీపిక పార్ట్ లో మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

ఇక, రాకా కోసం దీపిక కొన్ని సన్నివేశాలలో గర్భవతిగా కనిపించాల్సి ఉంది. అయితే, ఆ సీన్స్ తీసే సమయానికి నిజంగానే ఆమె ప్రగ్నెంట్ కావడంతో ఒరిజినల్ ప్రెగ్నెన్సీతోనే షూట్ చేయడం విశేషం. ప్రస్తుతం, ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే, ఈ నెలలోనే రాకా నుంచి గ్లింప్స్ రానుందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. దీంతో, ఇక రాకా ప్రపంచం నుంచి వరుసగా అప్‌డేట్స్ రాబోతున్నాయని హింట్ ఇచ్చారు.

పుష్ప ఫ్రాంఛైజీస్ నుంచి అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, రాకా సినిమాకి పాన్ వరల్డ్ స్థాయిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిజినెస్ పరంగా కూడా భారీ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. మరి, ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేస్తాడో చూడాలి. ఇక, రాకా తర్వాత లోకేష్ కనగార్జ్ దర్శకత్వంలో ఒక సినిమా బాసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో ఒక సినిమాను చేయనున్నాడు.

#Allu Arjun#Raaka#Deepika Padukone#Atlee Kumaar#Sun Pictures
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి