సినిమా

Vishwambhara: 'విశ్వంభర' మూవీపై దర్శకుడి ఆవేదనా ఇది?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vishwambhara: ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట. ఆ సినిమానే బింబిసారా. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ లేదు. సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన బింబిసారా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీంతో, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అదే, విశ్వంభర. తాజాగా ఈ సినిమాపై వశిష్ట పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఒకప్పుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా దాదాపు ఏడేళ్ళ పాటు షూటింగ్ దశలోనే ఉండిపోయింది. రోజుల తరబడి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లోనే చిరంజీవి గడిపారు. అంతేకాదు, రోజంతా ఒకే ఒక్క కాస్ట్యూంతో ఉండేవారు. అన్ని సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటికే, ప్రేక్షకుల్లో..అభిమానుల్లో ఆసక్తి బాగా తగ్గిపోయింది.

ఇప్పుడు, వశిష్ట-చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా విషయంలోనూ అదే రిపీటవుతుందని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. ఇప్పటికే, ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. కానీ, ఫస్ట్ టీజర్ నుంచే నెగిటివ్‌గా కామెంట్స్ వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు సెట్ కాలేదని బాగానే ట్రోల్ చేశారు. దీనికి అనుభవం లోపించడమే అన్నారు.

అయితే, తాజాగా దర్శకుడు వశిష్ట ఎక్స్ లో పెట్టిన ఒక కొత్త పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో..

"శ్వాస నాది, శాసనం నీది

ఆశ నాది, పాశం నీది,

ఆత్మ నాది, ఆట నీది…

ఎంత మాయగాడివయ్యా!

ఓం నమః శివాయ!!!

ఇందుకేనా నిన్ను “విశ్వంభరుడు” అని పిలిచేది?!

సర్వం శివం.. ఓం నమః శివాయ !!

అంటూ రాసుకొచ్చాడు. దీంతో, ఈ సినిమాకి ఇంకా శివాజ్ఞ రాకేదా? అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే, దసరా పండుగరోజున అప్‌డేట్ ఇవ్వడానికి హింట్ ఇచ్చాడా..అని కూడా చెప్పుకుంటున్నారు.

#megastar chiranjeevi#trisha#aashika ranganath#vishwambhara#Mallidi Vassishta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి