సినిమా

Kayadu Lohar: మొదటిసారి ఒక హీరోయిన్ విషయంలో నాని ఇలా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kayadu Lohar: సెప్టెంబర్ 24న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'ది ప్యారడైజ్ సినిమా'. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాకి 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఎలాంటి ట్రైలర్ కట్ లేకుండా ఎ సర్టిఫికెట్‌తో నేరుగా థియేటర్స్‌లోకి రాబోతోంది 'ప్యారడైజ్'. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో, భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్స్‌కి రాకపోవడానికి ఇంకో సినిమానే కారణం అని క్లారిటీ ఇచ్చాడు.

కయాదు లోహర్ ఇటీవల వరుసగా మూడు సినిమాలతో వచ్చింది. కానీ, ఆ మూడు సినిమాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయాయి. అయినా కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. అలా, ఇప్పుడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కయాదు ఓ గొప్ప సినిమాను చేస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయో సినిమాను మీరందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తారని నాని చెప్పాడు. ఇటీవల, ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో కయాదు కనిపించడం లేదని వార్తలు వచ్చాయి.

దీనికి, కారణం ఆమెకి చిత్ర బృందానికి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని అనుకున్నారు. లేదంటే ఇంత భారీ చిత్రాన్ని చేసి కూడా ప్రమోషన్స్‌కి రాకపోవడం ఏంటీ..? ఏదో జరిగింది..అంటూ ప్రచారం అవుతోంది. ఇదే ప్రశ్న నానిని మీడియా వారు సూటిగా అడిగారు. దానికి, నాని ఏమాత్రం తోసిపుచ్చకుండా కయాదు బిజిగా ఉందని సపోర్టివ్‌గా సమాధానమివ్వడం గొప్ప విషయం. వాస్తవానికి, ఇలాంటి సందర్భం నానికి ఇంతకముందు ఏ సినిమాకి..ఏ హీరోయిన్‌తోను ఎదురవలేదు.

అయితే, నాని చెప్పినట్టుగా కయాదు..మారి సెల్వరాజ్‌తో సినిమాను చేస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఇందులో నటిస్తుండగా.. కథిర్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఈ సినిమాకి 'ఇసైజ్ఞాని' ఇళయరాజా సంగీతం అందిస్తుండటం. ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. 'మంజంతి' అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కాబట్టే, కయాదు ప్యారడైజ్ ప్రెస్‌మీట్స్‌కి హాజరవలేకపోతోంది. ఏదేమైనా, ఈ సమయంలో గనక ప్యారడైజ్ హిట్ అయితే గ్యారెంటీగా కయాదు కెరీర్ ఊపందుకుంటుంది.

#nani#kayadu lohar#the paradise#srikanth odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి