Tollywood: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ గ్లోబల్ మూవీపై రోజురోజుకీ అంచనాలు రెట్టింపవుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక, ఇప్పటికే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, కాస్టింగ్ వంటి విషయాలలో గురించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రూ.290 కోట్ల భారీ డీల్..ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్!
తాజా సమాచారం ప్రకారం.. వారణాసి సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. దీనికోసం ఏకంగా రూ.290 కోట్లును ఆఫర్ చేశారట. అయితే, ఇంకా, ఈ డీల్‌పై వారణాసి మేకర్స్ కానీ, మైత్రీ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే.. తెలుగు సినిమా బిజినెస్‌లో ఇదొక సరికొత్త రికార్డుగా నిలవనుంది. ఇప్పటివరకు, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.225 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఇప్పుడు వారణాసి ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
వారణాసి కోసం పోటీలో నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థలు..
రాజమౌళి వారణాసి హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నాగ వంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా పోటీ పడినట్లు సమాచారం. కానీ, చివరకు మైత్రీ సంస్థ ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో అటు సినిమాల నిర్మాణం పరంగా ఇటు డిస్ట్రిబ్యూషన్ పరంగా మైత్రీ దూకుడు చూపిస్తోంది. ఇప్పుడు, వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రిలల్ రైట్స్ దక్కించుకోవడం అంటే మరో మైల్ స్టోన్ చేరుకున్నట్టే.


