Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో వస్తున్న వార్తలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రస్తుతం, చేస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత దాదాపుగా తమిళ, మలయాళ దర్శకులకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చిరు లైనప్ చూస్తుంటే అర్థమవుతోంది. సంక్రాంతికి కాకా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న చిరు, విశ్వంభర కూడా మార్చి లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌కు బ్రేక్?
నేచురల్ స్టార్ నానితో దసరా వంటి సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నాని సమర్పిస్తూ నిర్మించాల్సి ఉంది. చిరుని ఇంతవరకు చూడని రా అండ్ వైలెంట్ పాత్రలో చూపిస్తానని దర్శకుడు ప్రకటించడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్ కూడా చాలా ఆసక్తిని రేకెత్తించింది.
అయితే. ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు..ఈ సినిమా ఫలితం వల్ల చిరంజీవి సినిమా కూడా వెనక్కి వెళ్లింది. ఈ విషయాన్ని నాని కూడా గతంలో వెల్లడించారు. ఇప్పుడు, ఈ సినిమా నిలిచిపోయిందనే మాట కూడా వినిపిస్తుంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, తాజా సమాచారం మేరకు ఒక తమిళ దర్శకుడు, ఒక మలయాళ దర్శకుడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చిరు ఒక సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. ఫైనల్ డెసిషన్ చిరు దగ్గర ఉంది. జిగర్తాండ, మహాన్, పేట లాంటి సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ కోలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. రజనీకాంత్ ను పేట సినిమాలో ప్రెజెంట్ చేసిన విధానంతో, చిరంజీవి-కార్తీక్ సుబ్బరాజ్‌ల కాంబోలో సినిమా వస్తే గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
అలాగే, మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి పేరు కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. మోహన్‌లాల్, తరుణ్ మూర్తి కాంబినేషన్లో వచ్చిన తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. కథలో బలమైన భావోద్వేగాలతో పాటు ఓ స్టార్ ను డీసెంట్ గా ఎలా ఎలివేట్ చేయొచ్చో తరుణ్ మూర్తి ప్రూవ్ చేశాడు. చిరు ఇలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి, తరుణ్ చెప్పిన స్క్రిప్ట్ గనక చిరు ఓకే చేస్తే క్లాసిక్ హిట్ పడుతుందనడంలో సందేహమే లేదు. మరి, చిరు లైనప్‌లో వీరికి స్థానం దక్కుతుందా లేదా చూడాలి.


