తెలంగాణ

సీఎం రేవంత్.. వెయ్యి కోట్ల హామీ ఏమైంది- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

3 నిమిషాల పఠనం

Rs Praveen Kumar: దేశవ్యాప్తంగా పేరొందిన, వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్లుగా పని చేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు ఇప్పటికీ హెల్త్ కార్డుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Rs Praveen Kumar: దేశవ్యాప్తంగా పేరొందిన, వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్లుగా పని చేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు ఇప్పటికీ హెల్త్ కార్డుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాన్ టీచింగ్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు హాజరై హాజరై వారి పోరాటానికి సంఘీభావం తెలిపారాయన. తెలంగాణలో ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి, ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఈ ఉద్యోగుల సమస్యలు నెరవేరుతాయి. కానీ వారికి చిత్తశుద్ధి లేదు అని విమర్శించారు.

రూల్స్ పేరుతో కాలయాపన

స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలో అన్ని అధికారాలు గౌరవ వైస్ ఛాన్సలర్ కి ఉంటాయి.. కానీ విద్యాశాఖ సెక్రటరీ ఆదేశాలంటూ వారు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఆధారంగా చేసుకొని, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, విద్యుత్ శాఖలో ఆర్టిజన్ ఉద్యోగులను, విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినట్టుగా, ఈ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయవచ్చు.. కానీ రూల్స్ పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది

వెయ్యి కోట్లు ఇస్తామని ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన హామీని నెరవేర్చినా వీరి బాధలు తీరతాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అయినా నాన్ టీచింగ్ ఉద్యోగుల బాధలు అర్థం చేసుకొని, ఒక కుటుంబ పెద్దగా వారి బాధలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్ చివరివరకు అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.

#Rs Praveen Kumar#Brs#Telangana#Congress#Cm Revanth Reddy#Osmania University#Non Teaching Employees#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి