సినిమా

Tollywood: అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..హైదరాబాద్‌కి రాకా షిఫ్ట్!

4 నిమిషాల పఠనం

Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా రాకా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే, తాజా సమాచారన్ మేరకు..త్వరలో రాకా బృందం హైదరాబాద్‌కి షిఫ్ట్ కాబోతోందట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో రాకా చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా రాకా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే, తాజా సమాచారన్ మేరకు..త్వరలో రాకా బృందం హైదరాబాద్‌కి షిఫ్ట్ కాబోతోందట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో రాకా చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అట్లీ కుమార్ హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమాను తెరకెక్కితున్న సంగతి తెలిసిందే. దీపిక పడుకొనె హీరోయిన్‌గా..రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక, ఇప్పటివరకు ఈ చిత్రీకరణ మెజారిటీ భాగం ముంబైలోనే జరిగింది. అయితే, ఇప్పుడు చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

దుబాయ్ ప్లాన్ క్యాన్సిల్.. హైదరాబాద్‌కు యాక్షన్ షెడ్యూల్!

వాస్తవానికి రాకా చిత్రంలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరించాలని అట్లీ ముందు షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు. అయితే, ఇరాన్-ఇస్రాయెల్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఆ ప్లాన్‌లో మార్పులు చేసి ముంబైలోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు, ఆ ప్లాన్స్ మార్చినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో తీయాలనుకున్న యాక్షన్ ఎపిసోడ్స్‌ను ముంబై స్టూడియోలో కాకుండా హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్రబృందం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకోనుంది. అక్కడ నిర్మిస్తున్న భారీ సెట్స్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలో జరగడంతో అల్లు అర్జున్ ప్రతీ షెడ్యూల్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన తరచూ.. విమానాశ్రయాల్లో కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కీలకమైన షెడ్యూల్ జరగనుండటంతో బన్నీకి కూడా కొంత ప్రయాణ భారం తగ్గనుంది. కాగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

#Allu Arjun#Raaka#Atlee Kumar#Sun Pictures#Deepika Padukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి