తెలంగాణ

వంట గదుల్లో బొద్దింకలు, ఎక్స్‌పైరీ పదార్ధాలు.. క్లౌడ్ కిచెన్లలో దారుణాలు

3 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో క్లౌడ్ కిచెన్లపై TG SAFE FOOD WING, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

క్యూర్ ఏరియాలో క్లౌడ్ కిచెన్లలో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ మెరుపు దాడులు

25 ప్రత్యేక బృందాలతో తనిఖీలు

వెలుగులోకి అపరిశుభ్రత, నాణ్యతా లోపాలు

TG Safe: హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో క్లౌడ్ కిచెన్లపై TG SAFE FOOD WING, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పలు క్లౌడ్ కిచెన్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రతకు సంబంధించిన పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వంట గదుల్లో బొద్దింకలు, కీటకాలు

తనిఖీల సందర్భంగా ఒక కిచెన్‌లో సుమారు 15 బాక్సుల ఫుడ్ కలర్స్‌ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన సగ్గుబియ్యం నిల్వలను కూడా కనుగొన్నారు. అంతేకాకుండా వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు ఉండటం చూసి షాక్ అయ్యారు. కూరగాయలు కట్ చేసేందుకు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. మరోవైపు బొంబాయి రవ్వలో కూడా కొన్ని రకాల కీటకాలను గుర్తించడం కలకలం రేపింది.

ఆహార తయారీలో అపరిశుభ్రత.. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన

ఆహార తయారీలో పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడం వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనల ఆధారంగా కొన్ని క్లౌడ్ కిచెన్లను మూసివేయడంతో పాటు, మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మరికొన్ని కేంద్రాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇవ్వనున్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

#TG Safe Food Wing#Checkings#Cloud Kitchen#Hyderabad#Expiry Food#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి