సినిమా

Tollywood: మోహన్ బాబు, అర్జున్, అరవింద స్వామీ..

రచన: Anshu3 నిమిషాల పఠనం

Tollywood: మన సీనియర్ హీరోలలో మంచు మోహన్ బాబుకి సమకాలీయులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇంకా, హీరోలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. కానీ, మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హీరోగా ఆయనెప్పుడో ఫేడవుట్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. సొంత బ్యానర్ లో సినిమా చేయాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడకపోవచ్చు. అందుకే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్నాడు మోహన్ బాబు. అప్పట్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ లో యముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో డాన్ గా నటించాడు.

కన్నప్పలోనూ కీలక పాత్రను పోషించాడు. ఇక, ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో షికంజా మాలిక్ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే, ఈ పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. గ్యారెంటీగా ఈ సినిమాతో మోహన్ బాబు చాలా బిజీ అవుతాడని అర్థమవుతోంది. ప్యారడైజ్ లో నాని-మోహన్ బాబు మధ్య వచ్చే సీన్ చాలా ఇంటెసివ్‌గా ఉంటాయట.

అయితే, అర్జున్..అరవింద స్వామీ లాంటి క్రేజ్ మాత్రం రీ ఎంట్రీలో మోహన్ బాబుకి రావడం లేదు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ధృవ సినిమాలో నటించిన అరవింద స్వామీ..తన పర్ఫార్మెన్స్ తో హీరోనే డామినేట్ చేశాడు. అలాగే, అర్జున్ కూడా. కానీ, అరవింద స్వామీ, అర్జున్ రేంజ్‌లో మాత్రం మంచు మోహన్ బాబు క్రేజ్ సంపాదించుకోలేకపోతున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుటున్నారు.

#mohan babu#the paradaise#nani#srikanth odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి