ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ భర్త, అత్త హత్యకు స్కెచ్ వేసింది.అనుకున్న ప్రకారమే తన ప్లాన్ వర్కౌట్ చేసింది. కూరలో విషం కలిపి అత్త, భర్తకు పెట్టింది. కాసేపటి తర్వాతే తిన్నవారికి వాంతులు, విరచనాలు, తలతిరగడం మొదలవ్వడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.సోని(33) అనే మహిళ తన భర్త భూమయ్య, అత్త భూదేవ్వతో కలిసి ఉంటోంది. భూమయ్య, సోని దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే.. సోని మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన ఎఫైర్‌కి అడ్డుగా ఉన్నారని.. భర్త, అత్తను చంపాలని ప్లాన్ వేసింది సోని..ఈ క్రమంలోనే.. ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు కలిపింది.మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భూదేవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. భర్త భూమయ్యకు తల తిరగడంతో తనకేదో అవుతోందని స్థానికులకు చెప్పాడు.
వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో తల్లికొడుకు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, భూమయ్య, అత్త ఇచ్చిన ఫిర్యాదుతో సోనిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అతని ప్రోద్భలంతో సోని ఇలా చేసిందా? లేదా? ఆమెనే ఇంతటి వ్యవహారం నడిపిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
https://x.com/pulsenewsbreak/status/2084469874110214502?s=20












